
ఉసిరి ఆరోగ్య ప్రయోజనాలు :
ఉసిరి తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఉసిరికాయను దాని ఔషధ గుణాల కారణంగా ఆహారంలో, ఆరోగ్యం కోసం ఎన్నో సంవత్సరాలుగా ఉపయోగిస్తున్నారు. ఇది ఇన్ఫెక్షన్, జలుబు, దగ్గు రాకుండా రోగనిరోధక శక్తిని పెంచుతుంది. కానీ మధుమేహం, క్యాన్సర్, గుండె జబ్బులు, అధిక రక్తపోటు, మూత్రపిండాల సమస్యలను దూరం చేస్తుంది. ఇది జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. ఉసిరిని ఆయుర్వేదంలో ఆమ్లా అంటారు. ఇది శరీరంలోని టాక్సిన్లను తొలగించి జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఉసిరి షుగర్ లెవెల్ ని కంట్రోల్ చేయడంలో సహాయ పడుతుంది. క్రోమియం అధికంగా ఉండటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడాన్ని నివారిస్తుంది. తాజా ఉసిరిని తీసుకోవడం వల్ల ఇన్సులిన్ మెరుగుపడుతుంది. ఈ విధంగా ఇది రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది.
చలికాలంలో మలబద్ధకం సమస్యతో చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. ఇందులో అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది. ఉసిరికాయ జీర్ణ సంబంధిత వ్యాధులను నయం చేయడంలో సహాయ పడుతుంది. ఇది థైరాయిడ్, కంటి చూపు, అసిడిటీ, బరువు తగ్గడం వంటి సమస్యలను దూరం చేయడంలో సహాయపడుతుంది.