నేటి రోజుల్లో ప్రతి ఇంట్లో ఉండే సమస్య దోమల బెడద. పల్లెలు పట్టణాలు నగరాలు అనే తేడా లేదు అన్ని చోట్ల ఈ దోమల బెడద మాత్రం తప్పకుండా ఉంది అని చెప్పాలి. ఇక దోమల బారి నుంచి తప్పించుకునేందుకు జనాలు చేసే ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. ఇక ఇంటి చుట్టూ ఉన్న కిటికీలకు తలుపులకు కూడా దోమతెరలు ఏర్పాటు చేసుకుని ఇక దోమల బారి నుంచి బయటపడేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అందరూ. అయితే ఇలా దోమతెరలు ఏర్పాటు చేసుకుని ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. నాని సినిమాలో పగబట్టిన ఈగ ఏదో ఒక విధంగా ఇంట్లోకి చొరబడి నట్లు.. ప్రతి ఇంట్లో  దోమలు ఇంట్లోకి వచ్చి ఇక రక్తం పీల్చేస్తూ ఉంటాయి.


 ఒకప్పుడు కేవలం వర్షాకాలంలో మాత్రమే దోమల బెడద ఎక్కువగా ఉంటుంది అని అనుకునే వారు. ఇటీవలి కాలంలో మాత్రం కాలంతో సంబంధం లేకుండా ఇక ఎప్పుడు చూసినా దోమలు కాస్త ఎక్కువగానే రక్తం పీల్చేస్తూ ఉన్నాయి. దోమలను చంపేందుకు ఎన్ని దోమ కాయిన్స్ వాడినా కూడా ప్రయోజనం  లేకుండా పోతుంది అనే చెప్పాలి. అయితే కొన్ని కొన్ని సార్లు ఓకే దగ్గర కూర్చున్న ఇద్దరు వ్యక్తులకు దోమలు కుట్టడం విషయంలో వ్యత్యాసం ఉంటుంది. ఒకరికి దోమలు రక్తం పీల్చి చిరాకు తెప్పిస్తే.. మరొకరి దగ్గరికి మాత్రం అస్సలు పోవు. అదేంటి దోమలు నన్ను మాత్రమే కుడుతున్నాయ్.. నా రక్తం అంత టేస్ట్ గా ఉందా ఏంటి అని అప్పుడప్పుడూ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు చాలా మంది.

 ఇలాంటి అనుభవం మీకు కూడా జరిగే ఉంటుంది. అయితే రాత్రివేళ దోమలకు కళ్ళు బాగా కనిపిస్తాయి. అంటే దోమలు ఎక్కువగా డార్క్ కలర్ బట్టలు వేసుకున్న వాళ్ళని ఎట్రాక్ట్ అవుతాయి. నేవీ బ్లూ,బ్లాక్, రెడ్ కలర్ బట్టలు వేసుకున్న వారిని ఎక్కువగా కు.డతాడట.  160 అడుగుల దూరం నుంచి కార్బన్ డయాక్సైడ్ ను గుర్తించి మనుషుల దగ్గరకు వస్తాయట. లావుగా బరువు అధికంగా ఉన్నవారు గర్భంతో ఉన్న మహిళలు కార్బన్ డయాక్సైడ్ ఎక్కువగా విడుదల చేస్తారు. అందుకే దోమలు వారినే ఎక్కువగా కుడతాయి. ఇది ఎవరో చెప్పింది కాదు సైంటిస్టులు చెబుతున్న మాట..

మరింత సమాచారం తెలుసుకోండి: