ప్రస్తుత కాలంలో ఎక్కువ మంది మూత్రపిండల సమస్యల తో బాధపడుతూ ఉన్నారు. అయితే ఇలాంటి వారు కొన్ని హోం రెమెడీస్ వాడడం వల్ల వీటి నుంచి ఉపశమనం పొందవచ్చని కొంతమంది నిపుణులు తెలియజేస్తున్నారు. అలాంటి వాటిలో కలబంద కూడా ఒకటి. కలబంద వల్ల అనేక ఆరోగ్య సమస్యలను దూరం చేయడం తో పాటు మరెన్నో లాభాలను కూడా అందిస్తుంది. కలబంద రసంలో యాంటి మైక్రోబియల్ లక్షణాలు ఉండటం వల్ల అనేక ఆరోగ్య సమస్యలను దూరం చేస్తుంది. ముఖ్యంగా కిడ్నీ సమస్యలు, కిడ్నీలో రాళ్లు తదితర సమస్యలతో బాధపడుతున్నవారు ఈ కలబందను ఉపయోగించుకోవచ్చు. ఈ కలబంద ను ఎలా ఉపయోగించుకోవాలి.? ఎలా తీసుకోవాలో ఇప్పుడు ఒకసారి చూద్దాం.


ప్రతిరోజు రెండు గ్లాసుల కలబంద జ్యూస్ ని తీసుకునే వాళ్లకు శరీరంలో మినరల్స్ స్పష్టీకరణ లాంటివి తగ్గడం వలన మూత్ర పిండాలలో రాళ్ల సమస్య నుండి విముక్తి పొందవచ్చు అని నిపుణులు తెలియజేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ కలబంద జ్యూస్ ను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.

1). కలబందను గోరువెచ్చని నీటిలో బాగా కలిపి తీసుకోవడం వలన మూత్రపిండాలలో రాళ్ల సమస్య నుండి ఉపశమనం పొందవచ్చు.

2). కలబంద రసంలో కి కాస్త నిమ్మరసాన్ని వేసుకొని ఆ మిశ్రమాన్ని తాగినట్లయితే కిడ్నీలో రాళ్ల సమస్య ను తొలగించుకోవచ్చు.

3). ఒకవేళ కలబంద లో తేనెను మిక్స్ చేసుకొని తాగినట్లయితే కిడ్నీలో రాళ్ల సమస్య నుండి ఉపశమనం పొందడమే కాకుండా ఇది గొప్ప పానీయంగా పనిచేస్తుందని నిపుణులు తెలియజేశారు.

4). కలబంద కేవలం తాగడానికి కాకుండా ముఖానికి కూడా అప్లై చేసినట్లు అయితే ముఖం మెరవడం ఖాయమని చెప్పవచ్చు.

5). ఈ కలబంద జ్యూస్ వల్ల అధిక బరువు సమస్యతో బాధపడుతున్న వారు బరువు తగ్గడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది.

ఈ విధంగా చేయడం వల్ల కిడ్నీ సమస్య లోని రాళ్లను తగ్గించుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: