సాధారణంగా వర్షాకాలం అంటే అటు సినిమాల్లో ఎంతో అందంగా కనిపిస్తూ ఉంటుంది. సినిమాల్లో కనిపించేవాళ్ళు వర్షంలో తడవడం ఇంట్లోకి వెళ్లి ఇక వర్షంలో ఎంజాయ్ చేసిన దాని గురించి మాట్లాడుకోవడం చూస్తూ ఉంటే అబ్బా వర్షాకాలం వస్తే ఎంత బాగుండు అని అనుకుంటూ ఉంటారు అందరూ. కానీ తీరా వర్షాకాలం వచ్చిన తర్వాత మాత్రం ఏర్పడే ఇబ్బందులు చూసి ఇక ఈ వర్షాకాలం  ఎప్పుడు పోతుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఇక భారీ వర్షాల నేపథ్యంలో ఎక్కడికక్కడ నీటితో నిండిపోయిన పరిసరప్రాంతాలు.. ఇక దోమలు ఈగలు ఏకంగా అందరిపై యుద్ధానికి దిగినట్లుగా ఎక్కడపడితే అక్కడ కనిపించడం లాంటివి జరుగుతూ ఉంటుంది.


 ఈ క్రమంలోనే మిగితా సీజన్ లతో పోల్చి చూస్తే అటు వర్షాకాలంలో మాత్రం ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుకునేందుకు మరింత జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది అనే చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక వర్షాకాలం  కాలం సీజన్లో కొన్ని కూరగాయలకు దూరంగా ఉండటమే ఎంతో మంచిదని నిపుణులు చెబుతున్నారు. అదేంటి కూరగాయలు ఆకు కూరలు తింటే మంచిది అంటారు కదా.. ఇప్పుడు దూరంగా ఉండడం ఏంటి అని ఆశ్చర్య పోతున్నారు కదా.. ఆ విషయాలు ఏంటో తెలుసుకుందాం.. వర్షాకాలంలో ఆయిల్ ఫుడ్ జంక్ ఫుడ్ లాంటిది పక్కకు పెట్టడం మేలు అంటున్నారు కొంతమంది.


 సాధారణంగా ఆకుకూరలు ఆరోగ్యానికి ఎంతో మంచివి అనే విషయం తెలిసిందే. కానీ వర్షాకాలంలో ఆకుకూరలను తినడం వల్ల వాంతులు విరేచనాలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందట. మొక్కల ఆకులపై హానికరమైన సూక్ష్మజీవులు బ్యాక్టీరియా ఉంటాయట. అందువల్ల వీలైనంత వరకు వర్షాకాలంలో ఆకుకూరలను దూరం పెట్టడం మంచిదంటున్నారు. వర్షాకాలంలో  అందరికీ నోరూరించే వంకాయలో ఎన్నో రకాల రసాయన చర్యలు జరుగుతాయి. ఈ క్రమంలోనే ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుకునేందుకు.. వంకాయను కూడా దూరం పెట్టడం మేలు అంటున్నారు నిపుణులు. కాదని తింటే ఎంతో మందిలో దురద దద్దుర్లు వికారం వాంతులు లాంటి దుష్ఫలితాలు ఎదుర్కొనే అవకాశం ఉంటుందట. అంతేకాకుండా క్యాప్సికమ్ క్యాలీఫ్లవర్ లాంటివి కూడా వర్షాకాలంలో తినకపోవడం ఉత్తమం అని సూచిస్తున్నారు నిపుణులు.

మరింత సమాచారం తెలుసుకోండి: