కాకరకాయ తినాలి అంటే ఎక్కువగా చాలామంది ఇష్టపడరు ఎందుచేత అంటే ఇది కాస్త చేదుగా ఉంటుందని చెప్పవచ్చు. అయితే ఇది తినడానికి చేదుగా ఉన్న ఇందులో ఉండే ఆరోగ్య ప్రయోజనాలు మాత్రం చాలానే ఉన్నాయని చెప్పవచ్చు. అయితే అలాంటి ప్రయోజనాలు తెలిసిన కూడా తినడానికి ఇష్టపడని వారు ఏరుకోరి జబ్బులను తెచ్చుకుంటారని చెప్పవచ్చు. ఇప్పుడు కాకరకాయ టీ తాగడం వల్ల కూడా పలు ప్రయోజనాలు ఉన్నాయి. కాకరకాయను తినలేని వారికి ఇదొక ఆప్షన్ అని చెప్పవచ్చు.కాకరకాయ టీ వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలతో పాటు క్యాన్సర్ ని సైతం దూరం చేసే గుణం ఈ కాకరకాయ టీలో ఉన్నట్లుగా ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు అయితే ఈ కాకరకాయ టీం ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో మనం తెలుసుకుందాం.


ముందుగా కాకరకాయలను తీసుకొని వాటిని బాగా నీటిలో కడిగి శుభ్రపరచాలి. అలా శుభ్రపరిచిన వాటిని ముక్కలుగా కోసి ఎండలు ఎండ పెట్టాలి. అలా ఎండిన ముక్కలను నీటిలో వేసి బాగా వేయించాలి అలా ఒక పది నిమిషాలు మరిగించిన తర్వాత ఆ కాకరకాయ రసాన్ని వేరు చేసి దానిలోకి కాస్త తీయని నిమ్మరసం కలుపుకొని తాగాలి. ఇలా ప్రతిరోజు ఈ మిశ్రమాన్ని తాగడం వల్ల బిపి సమస్యతో ఇబ్బంది పడుతున్న వారు వెంటనే తగ్గుముఖం పడుతుంది.

ఇక షుగర్ తో ఇబ్బంది పడేవారు కూడా దీన్ని తాగడం వల్ల కంట్రోల్ లోకి వస్తుందట ఇక చెడు కొలెస్ట్రాలతో ఇబ్బంది పడుతున్న వారు అధిక బరువుతో ఇబ్బంది పడేవారు వీటిని తరచు తాగడం వల్ల ఫలితం కనిపిస్తుంది. ముఖ్యంగా శరీరంలో వ్యర్ధాలను తొలగించడానికి ఈ కాకరకాయ టీ చాలా రకాలుగా ఉపయోగపడుతుంది అందువల్ల ప్రతిరోజు కూడా ఈ కాకరకాయ టీ తాగడం వల్ల క్యాన్సర్ జబ్బును అరికట్టవచ్చు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ఇవి మన శరీరంలోని రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: