ఉదయం పూట నిద్రలేవగానే కాఫీ తాగటం అనేది చాలా మందికి అలవాటు. కాఫీ తాగితే రోజంతా కూడా చాలా చురుకుగా ఉంటామని నమ్ముతుంటారు. వాస్తవానికి కాఫీ తాగిన వెంటనే కెఫిన్ కారణంగా శరీరంలోని నాడీ వ్యవస్థ అనేది మంచి ఉత్తేజపూరితంగా మారుతుంది.అందుకే మనలో ఎక్కడా లేని హుషారు వస్తుంది. చురుకుదనం కలుగుతుంది. కొంత మందికి వేళకు కాఫీ పడకపోతే చిరాకుగా ఉంటుంది. కాఫీ తాగని వారితో పోల్చితే రోజుకు రెండు లేదా మూడు కప్పుల కాఫీ తాగేవారిలో గుండె సంబంధ వ్యాధులు వచ్చే అవకాశం 5 నుంచి 12 శాతం తక్కువని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే కాఫీతో కొన్ని రకాల మసాల దినుసుల పొడులు చేర్చకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని చెబుతున్నారు.సీజన్లవారీ ఇన్ఫెక్షన్లు దూరం చేయడంలో అల్లం బాగా ఉపకరిస్తుంది. అల్లం చిన్న ముక్కలు లేదా శొంఠి పొడిని కాఫీలో కలుపుకొని తీసుకోవచ్చు. ఇలా చేయటం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.విటమిన్‌ బి6, ఫోలిక్‌ యాసిడ్‌, మెగ్నీషియం, క్యాల్షియం, ఐరన్‌ లాంటి ఎన్నో జాజికాయ ద్వారా లభిస్తాయి. ఈ పొడిని కాఫీకి కలిపి చూడండి.


 అనీమియా దూరమవుతుంది. జీర్ణ సమస్యలుండవు. ఒత్తిడి తగ్గి నిద్ర బాగాపడుతుంది.కప్పు కాఫీకి పావు చెంచా లవంగపొడిని కలుపుకొని తాగండి. దీనిలో మినరల్స్‌, యాంటీ ఆక్సిడెంట్స్‌ పుష్కలం. దీనిలోని యుగెనాల్‌ ఒత్తిడి, కొన్నిరకాల క్యాన్సర్లను దూరం చేస్తుంది. గర్భధారణ అవకాశాలనూ పెంచుతుంది.నెలసరికి ముందు, ఆ సమయంలో తలనొప్పి, వికారం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి. కాఫీలో యాలకుల పొడి కలుపుకొని తాగండి. ఈ సమస్యలు తగ్గుతాయి.దీనిలోని మినరల్స్‌ రక్త ప్రసరణ బాగా జరిగేలా చేస్తాయి.నోటి దుర్వాసననే కాదు, ఒత్తిడినీ దూరమౌతుంది.సినమమ్‌ టీ చాలా మందికి తెలుసు. అయితే కాస్త భిన్నంగా ఈ పొడిని కాఫీలో కలుపుకోవాలి. నిద్రలేమి కారణంగా అలసట మటు మాయమవుతుంది. దీనిలో ఎక్కువ మోతాదులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్‌ రోగ నిరోధకతను పెంచుతాయి. చెడు కొలెస్టరాల్‌, ఇన్‌ఫ్లమేషన్‌నూ దరిచేరనీయవు.

మరింత సమాచారం తెలుసుకోండి: