దోమ కాటు అనేది అసలు చాలా చాలా ప్రమాదకరమైనది. దోమ కాటు కారణంగా మలేరియా, డెంగ్యూ, బోధకాలు వంటి విష జ్వరాల బారిన పడాల్సి వస్తుంది. కొన్నిసార్లు ఈ దోమ కాటు ప్రాణాంతకంగా కూడా మారుతుంది. ఆ జబ్బులు వల్ల చాలా మంది కూడా చనిపోతున్నారు. అలాంటి కేసులని కూడా మనం అసలు ఎన్నో చూస్తున్నాం. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.ఇంట్లో శుభ్రంగా లేకపోవడం, ఇంటి చుట్టూ పరిసరాలు అపరిశుభ్రంగా ఉండడం, ఇంటి చుట్టు పక్కల నీటి నిల్వలు ఉండడం వంటి కారణాల చేత ఇంట్లో అదేవిధంగా ఇంటి పరిసరాలలో దోమల బెడద ఎక్కువగా ఉంటుంది. దోమల బెడద నుండి తప్పించుకోవడానికి మనం స్ప్రేలు, మస్కిటో కాయిల్స్, రిఫిల్స్ వంటి వాటిని వాడుతున్నాం.వీటిని వాడడం వల్ల తాత్కాలికంగా బయటపడిన ఆరోగ్యం మాత్రం దెబ్బతింటుంది. వీటి తయారీలో రసాయనాలను ఎక్కువగా వాడతారు. వీటిని పీల్చుకోవడం వల్ల శ్వాస సంబంధిత సమస్యలతో పాటు ఇతర అనారోగ్య సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.


 దోమలను మనం సహజసిద్ద పద్దతుల్లో కూడా నివారించవచ్చు. దోమల బెడద నుండి బయటపడడానికి మనం సహజ పద్దతులను ఉపయోగించడమే మంచిది.ముందుగా ఒక శుభ్రమైన స్ప్రే బాటిల్ ను తీసుకుని దానిలో లవంగం నూనెను పోయాలి. తరువాత దానిలో తగినన్ని నీళ్లు పోసి బాగా కలపాలి. దీనిని దోమలు ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో, గది మూలల్లో, ఇంటి ఆవరణలో స్ప్రే చేయాలి. దోమలు ఎక్కువగా ఉన్నప్పుడు రెండు గంటలకొకసారి ఈ లవంగం నూనె స్ప్రే చేస్తూ ఉండాలి. లవంగం నూనె ఘాటుకు తట్టుకోకలేక దోమలు ఇంట్లో నుండి బయటకు పోతాయి. ఈ చిట్కాను పాటిస్తూనే దోమల తెరలు వాడడం, ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం, కిటికీలకు, వెంటిలేటర్లకు తెరలు అమర్చుకోవడం వంటివి చేయాలి. అలాగే నీటి పరిసరాల్లో నీళ్లు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల దోమ కాటుకు గురి కాకుండా ఉంటాం.కాబట్టి ఖచ్చితంగా ఈ టిప్ పాటించండి. దోమల బెడదని తగ్గించుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: