సాధారణంగా ఎండాకాలంలో దొరికే పనస పండును అందరు ఇష్టపడతారు. కానీ పనస పండు తిని విత్తనాలు పడేస్తుంటారు. మీరు అలాగే చేస్తున్నారా.. అయితే వాటి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు మిస్ అయినట్టే.వాటి ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అస్సలు పడేయరు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

పనస విత్తనాలలో విటమిన్ ఏ,మెగ్నీషియం, జింక్, పొటాషియం, ఐరన్, క్యాల్షియం,కాపర్ వంటి ఎన్నో న్యూట్రియాంట్స్ ఇందులో పుష్కళంగా లభిస్తాయి.అలాగే ఇందులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీఇన్ఫ్లమెటరీ గుణాలు గుణాలు అధికంగా ఉన్నాయి.

1).కంటి చూపు ఆరోగ్యానికి..
పనస విత్తనాలలో విటమిన్ ఏ అధికంగా ఉంటుంది. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల రేచీకటి, కలర్ బ్లైండనెస్ వంటి కంటి సమస్యలు తగ్గుతాయి. కంటిచూపు మెరుగుపడుతుంది.

2).ప్రోటీన్స్..
 ఇందులో శరీరానికి కావలసిన ప్రోటీన్లు పుష్కలంగా దొరుకుతాయి.ఇవి ఆహారంలో తీసుకోవడం వల్ల, కండర ఆరోగ్యం బలపడుతుంది. ఇవి ముఖ్యంగా చిన్న పిల్లల పెరుగుదలకు బాగా ఉపయోగపడుతుంది.

3).జీర్ణ శక్తిని బలపరుస్తుంది..
పనస విత్తనాల లో ఫైబర్ కంటెంట్ సమృద్ధిగా లభిస్తుంది. వీటిని కొన్ని తిన్నా కడుపు నిండిన భావన కూడా కలుగుతుంది. ఇది జీర్ణక్రియ మెరుగ్గా జరిగేలా ప్రోత్సాహస్తుంది.

4).గుండె ఆరోగ్యానికి..
పనస విత్తనాలు గుండెసమస్యలతో బాధపడేవారికి ఎంతో బాగా ఉపయోగపడతాయి. ఇందు లో కొలెస్ట్రాల్ శాతం అస్సలు ఉండదు. అందు వలన చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది. కావున గుండెకు సంబంధించిన వ్యాధులను రాకుండా కాపాడటంలో పనసవిత్తనాలు ముఖ్యపాత్ర పోషిస్తాయి.

5).క్యాన్సర్ ని నివారిస్తుంది..
పనసవిత్తనాలలో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా లభిస్తాయి.ఇందు లో ఉండే అధిక యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల శరీరాన్ని ఫ్రీరాడికల్ డేమేజ్ నుంచి కాపాడుతాయి. పనసవిత్తనాలలో యాంటీక్యాన్సర్ గుణాలు కలవు. ఇవి శరీరంలోని సెల్స్ పునురుత్పత్తి కాకుండా చేస్తాయి.

6). ఎముకలను బలపరుస్తుంది:
పనసవిత్తనాల లో లభించే క్యాల్షియం, పోటాషియం ఎముకల ఆరోగ్యాన్ని బలపరుస్తాయి.ఆస్తియోపోరోసిస్ తో బాధపడేవారికి చాలా బాగా ఉపయోగపడుతుంది.అందు వల్లనే పనసకాయ విత్తనాలను పడేయడం మంచిది కాదు.

మరింత సమాచారం తెలుసుకోండి: