బంగాళదుంప ఆరోగ్యానికి మంచిదా కాదా ?

బంగాళదుంపల్లో కార్బోహైడ్రేట్స్ చాలా ఎక్కవగా ఉంటాయి. పీచు పదార్థాలూ అధికమే. అందుకే డయాబెటిక్ రోగులు రోజంతా ఒక కప్పు బంగాళాదుంపల కంటే ఎక్కువ తినకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనితో పాటు పప్పులు, పచ్చి కూరగాయలు, ఇతర ఆరోగ్యకరమైన వాటిని డైట్ లో భాగం చేసుకోవాలి. డయాబెటిస్ ఉంటే ఫైబర్, ప్రొటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉన్న ఆహారాలను తీసుకోవాలి. అయినప్పటికీ డయాబెటిక్ బాధితులు పరిమతింగానే బంగాళాదుంపలను తినాలనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.భూమిలో పండే బంగాళదుంపలను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది ప్రజలు ఉపయోగిస్తారు. ఇతర కూరగాయలతో పోలిస్తే వీటి వినియోగం చాలా ఎక్కువ. వీటిలో ఉండే పొటాషియం, మెగ్నీషియం, ఫాస్పరస్, ఇనుము, జింక్ వంటి ఖనిజాలు, పిండి పదార్థాలు, ప్రొటీన్లు శరీరానికి బలాన్ని ఇస్తాయి. బంగాళదుంపలలో యాంటీ ఆక్సిడెంట్లూ అధికంగా ఉంటాయి. బంగాళాదుంపల్లో పిండి పదార్ధాలు సమృద్ధిగా ఉండటమే కాకుండా అధిక గ్లైసెమిక్ ఇండెక్స్ ఆహారంగా కూడా పరిగణిస్తారు. 


వీటిని పరిమిత పరిమాణంలో నెమ్మదిగా జీర్ణమయ్యే ఆహారాలతో పాటుగా తినాలి.బంగాళాదుంపలను తినడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని భావిస్తుంటారు. దీంతో చాలా మంది తినేందుకు వెనకడుగు వేస్తుంటారు. అయితే అమెరికాలోని బోస్టన్ యూనివర్సిటీలోని జర్నల్ ఆఫ్ న్యూట్రిషనల్ సైన్స్ పరిశోధకులు నిర్వహించిన నివేదిక ప్రకారం బంగాళాదుంపలు తినడం ఆరోగ్యం హానికరం కాదని గుర్తించారు. 30 ఏళ్లు పై బడిన 2,500 మందిపై ఈ పరిశోధన జరిగింది. బంగాళదుంపలు తినడానికి, అధిక రక్తపోటు వంటి ఆరోగ్య సమస్యల మధ్య సంబంధం లేదని గుర్తించారు. బంగాళాదుంపలను తినే వారికి ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం తక్కువగా ఉన్నట్లు కనుగొన్నారు. రెడ్ మీట్‌కు ప్రత్యామ్నాయంగా వీటిని తినవచ్చని సూచించారు. శారీరకంగా చురుకుగా ఉండటంతో పాటు టైప్ 2 మధుమేహం వచ్చే అవకాశాలు 24% తక్కువగా ఉన్నాయని పరిశోధనకులు వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: