ఈ కాలంలో ప్రతి ఒక్క ఇంట్లోనూ మధుమేహం బారిన పడుతున్నారు. ఇది మనకు తెలియకుండానే ఆరోగ్యాన్ని దెబ్బతీసే వ్యాధికారకం. మన మధుమేహం మన శరీరంలో ఉంది అంటే అది మన రోగనిరోధక వ్యవస్థ పై దాడి చేస్తుందని అర్థం.మధుమేహం ముదరకుండానే కొన్ని లక్షణాల వల్ల  ముందే వ్యాధిని గమనించి,తగిన జాగ్రత్తలు తీసుకుంటే మధుమేహం నుండి బయటపడవచ్చు.ఇలాంటి లక్షణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

 
 ముఖ్యంగా కొన్ని లక్షణాలను గుర్తించి,జాగ్రత్త పడితే ఫలితం ఉంటుంది. దీనికి తోడుగా సరైన ఆహార అలవాట్లు, నిద్రించే సమయాలు,కొన్ని రకాల మందుల సాయంతో డయాబెటిస్ రాకుండా జాగ్రత్త తీసుకోవచ్చు.

డయాభేటీస్ ఉందని తెలుసుకోవడానికి సులభమైన మార్గం ప్రతి ఆరు మసాలాకు ఒకసారి రక్త పరీక్ష చేయించుకుంటూ ఉండాలి.
డయాబెటిస్‌ ఉందో లేదో తెలియాలంటే ముందుగా మెడ కింద చర్మం మందంగా తయారవుతుంది. ఆ ప్రదేశంలో నల్లగా కూడా మారుతుంది.

మధుమేహం కారణంగా సెక్స్ లో పటుత్వం కూడా తగ్గుతుంది. రక్తంలో షుగర్ ఎక్కువగా ఉండడం వల్ల పురుషాంగానికి రక్తాన్ని తీసుకెళ్లే నరాలు బలహీనపడతాయి.

డయాబెటిస్‌ ఉన్న వాళ్లకు రానురాను దృష్టి లోపం పెరుగుతూంది.ఈ లక్షణంతో బాధపడేవారికి డయాభేటీస్ ఉందని గ్రహించాలి.
స్త్రీలలో అయితే పునరుత్పత్తి అవయవం వద్ద లూబ్రికేషన్ తగ్గుతుంది. లైంగిక వాంఛలు కూడా తగ్గుతాయి.

మధుమేహం ఉందనే గుర్తించడానికి మరో లక్షణాన్ని గమనించుకోవాలి. డయాబెటిస్ ఉన్న వారు ఎక్కువగా నిరుత్సాహంగా వుంటారు. ప్రతి దానికి కోపం ఎక్కువగా ప్రదర్శిస్తుంటారు.

మధుమేహం ఉన్న వాళ్లలో ఇన్సులిన్ మూత్రం రూపంలో బయటకు వెళ్ళిపోయి బరువు తగ్గుతుంటారు.కానీ బరువు తగ్గినంత మాత్రన డయాబెటిస్ మాత్రమే ఉందని నిర్దారించుకోకూడదు. వైద్యుని సహాయం తీసుకోవాలి.

కుటుంబంలో పెద్దలకు ఏమైనా మధుమేహం ఉన్నట్లయితే  ఇలాంటి లక్షణాలు కనబడిన వెంటనే వైద్య పరీక్షలకు వెళ్లాలి. డయాభేటీస్ ఉంటే మనశరీంలోని కణాలకు గ్లూకోజ్ అందక నిసత్తువుగా ఉంటారు. డయాబెటిస్ వల్ల శరీరంలోని రక్తనాళాలు దెబ్బతినడంతో రక్త ప్రసరణలో
కొన్ని అడ్డంకులు ఎర్పడతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: