ఎండాకాలం వచ్చేసింది. ఎండలు భగభగమంటున్నాయి.ఈ ఎండల వల్ల మన శరీరంలో ఆటోమాటిక్ గా వేడి ఎక్కువవుతుంది. అయితే మన ఇంట్లో ఉండే పదార్థాలతో కొన్ని రకాల రెమెడీస్ ని తయారు చేసుకుని వాడడం వల్ల మనం చాలా సులభంగా మన శరీరాన్ని చల్లబరుచుకోవచ్చు. అధిక వేడిని తగ్గించే ఆ టిప్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అధిక వేడి సమస్యతో బాధపడే వారు ఒక గ్లాస్ నీటిలో ఒక టీ స్పూన్ జీలకర్ర ఇంకా కండ చక్కెర కలిపి రెండు గంటల పాటు నానబెట్టాలి.ఆ తరువాత ఈ నీటిని తాగాలి. ఇలా రోజుకు రెండు సార్లు తాగడం వల్ల శరీరంలో వేడి తగ్గి శరీరం కూల్ అవుతుంది.అయితే నానబెట్టేంత సమయం లేని వారు ఈ రెండింటిని సమానంగా తీసుకుని పొడిగా చేసి స్టోర్ చేసుకోవాలి. ఈ పొడిని ఒక టీ స్పూన్ మోతాదులో ఒక గ్లాస్ నీళ్లల్లో కలిపి తాగడం వల్ల కూడా చాలా మంచి ఫలితం ఉంటుంది.అలాగే ఒక గ్లాస్ మజ్జిగలో అర చెక్క నిమ్మరసాన్ని కలిపి తాగడం వల్ల కూడా శరీరంలో వేడి చాలా ఈజీగా తగ్గుతుంది.


ఇంకా అదే విధంగా మూడు నుండి నాలుగు టీ స్పూన్ల సబ్జా గింజలను నీటిలో వేసి నానబెట్టుకోని ఆ సబ్జా గింజలను ఒక గ్లాస్ నీటిలో వేసి కలపాలి.అలాగే ఇందులోనే అర చెక్క నిమ్మరసాన్ని కలిపి తాగడం వల్ల వేడి తగ్గి చలువ చేస్తుంది.ఇంకా అలాగే ఒక గ్లాస్ నీటిలో తేనెను కలిపి రాత్రంతా అలాగే ఉంచి ఉదయాన్నే ఈ నీటిని పరగడుపున తాగడం వల్ల కూడా చాలా మంచి ఫలితం ఉంటుంది.ఇంకా వీటితో పాటు శరీరానికి తగినన్ని నీటిని కూడా తాగాలి. ఫ్రిజ్ లో నీటిని తాగడానికి బదులు సాధారణ నీటిని తాగడానికే మాత్రమే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. ఇంకా అలాగే కొబ్బరి నీటిని కూడా ఎక్కువగా తాగాలి. అలాగే మసాలా దినుసులను ఇంకా మాంసాహారాన్ని తక్కువగా తీసుకోవాలి. ఈ టిప్స్ పాటించడం వల్ల మనం చాలా సులభంగా శరీరంలో వేడిని తగ్గించుకోవచ్చు. కలిగించే పదార్థాలను ఎక్కువగా తినడం, నీటిని తాగకపోవడం, అధికంగా పని చేయడం, ఎండలో ఎక్కువగా తిరగడం, మాంసాహారాన్ని ఎక్కవుగా తీసుకోవడం వంటి పనులు మానుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: