ఇక గుండె సంబంధిత వ్యాధులకు ప్రధాన కారణం ఏంటంటే ఖచ్చితంగా ఒత్తిడి అని చెప్పాలి. మన దానిని జయించినట్లయితే చాలా వరకు గుండె సంబంధిత వ్యాధుల నుంచి బయటపడవచ్చు. ఒత్తిడి  తమకు ఇష్టమైన పాటలు వినడమో.. లేక పుస్తకాలు చదవడమో లేదా తమకు ఇష్టమైన పనులు ఏవైనా చెయ్యాలి. ఇలా చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభించి ఒత్తిడి చాలా ఈజీగా దూరం అవుతుంది. ఒత్తిడి అధికంగా ఉన్న వారిలో గుండె కొట్టుకునే వేగం కూడా చాలా ఎక్కువగా ఉంటుందని పరిశోధనలలో తేలింది.ఇక సాధారణంగా చేపలు ఎక్కవగా తినేవారిలో గుండె సంబంధిత వ్యాధులు తక్కువేనంటున్నారు వైద్య నిపుణులు. ఎందుకంటే చేపల్లో ఉండే ఒమేగా3 కొవ్వు ఆమ్లాలు గుండె పనితీరును బాగా మెరుగు పరుస్తాయి.ఇంకా అలాగే ప్రతిరోజు ఉదయం పూట బ్రేక్‌ఫాస్టులో ఓట్స్‌ తినడం వల్ల కూడా గుండెకు ఎంతో మేలు జరుగుతుంది. ఎందుకంటే వీటిలో లభించే బీటా గ్లూకాన్‌ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ స్థాయిని ఈజీగా తగ్గిస్తుంది.


గోధుమలు, బార్లీ, పప్పు ధాన్యాలు ఇంకా బీన్స్‌ మొదలైనవి ఆహారంలో తీసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే వీటిలో ఉండే విటమిన్స్‌, ఐరన్‌, ఫైబర్‌ యాంటీ ఆక్సిడెంట్లు రక్తపోటును ఈజీగా అదుపులో ఉంచుతాయి. దీని ద్వారా గుండె పనితీరు బాగా మెరుగుపడుతుంది. ఇంకా ఇవే కాకుండా టోమాటోలు, యాపిల్స్‌ అలాగే సోయా వంటివి రోజువారీగా తీసుకున్నట్లయితే గుండెను పూర్తిగా ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.అలాగే గుండెకు ఆకు కూరలు చాలా మంచివి. క్యాన్సర్‌ వంటి రోగాలను ఇవి దరిచేరనివ్వవు. పాలకూర, కొత్తమీద, ర్యాడిష్‌ మొదలైన వాటిలో కొవ్వు శాతం అనేది తక్కువ ఉండటంతో పాటు ఫోలిక్‌ యాసిడ్‌, మెగ్నీషియం, కాల్షియం ఇంకా పోటాషియం ఎక్కువగా లభిస్తాయి. ఇవి గుండె పనితీరును మెరుగు పర్చడంలో చాలా బాగా సహాయపడతాయి.ప్రతి రోజూ ఆహారంలో భాగంగా ఇవి తీసుకునేవారికి మిగిలిన వారితో పోలిస్తే హార్ట్‌ ఎటాక్‌ వచ్చే అవకాశాలు ఏకంగా 11 శాతం తక్కువగా ఉంటాయి.కాబట్టి ఖచ్చితంగా ఈ టిప్స్ పాటించండి. గుండె జబ్బులు రాకుండా ఆరోగ్యంగా ఉండండి.

మరింత సమాచారం తెలుసుకోండి: