మొన్నటి వరకు ప్లాస్టిక్ వాడకం ద్వారా పర్యా వరణ కాలుష్యం జరుగుతుందని ఇక ఈ కాలుష్యం ఏకంగా మాన వాళికి ముప్పుగా మారి పోతుందని ఎంతో మంది పర్యావరణ వేత్తలు హెచ్చరించారు. ఈ క్రమం లోనే ప్లాస్టిక్ వాడకం తగ్గించాలి అంటూ సూచించారు. కానీ ఇప్పుడు మాత్రం ప్లాస్టిక్ ను మించిన ప్రమాదం ముంచుకు వస్తుంది అని పర్యావరణ వేత్తలు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం కరోనా వైరస్ సమయం లో మాస్క్ వాడకం తప్ప నిసరి గా మారి  పోయింది. దీంతో ప్రస్తుతం ఎక్కడికి వెళ్లినా ఏం చేసినా కూడా ప్రతి ఒక్కరూ మాస్క్ ఉపయోగిస్తున్నారు.


 ఇంటి నుంచి బయటకు వెళ్ళినప్పుడే కాదు ఇళ్లల్లో కూడా మాస్క్ వినియోగిస్తున్నారు..  వైరస్ బారిన పడకుండా రక్షణ కల్పించు కోవడానికి మాస్క్ అనేది ఒక ఆయుధం గా మారి పోయింది. అయితే ఇక ఇప్పుడు కరోనా వైరస్ బారిన పడకుండా ఎంతో మంది ప్రాణాలను రక్షిస్తున్న మాస్క్ మరికొన్ని రోజుల్లో మానవాళి మనుగడకే ముప్పు కాబోతుంది అని పర్యావరణ వేత్తలు హెచ్చ రిస్తున్నారు. రోజు రోజుకు మాస్క్ వాడకం పెరిగి పోతున్న నేపథ్యం లో అటు మాస్క్ వ్యర్థాలు కూడా పెరిగి పోతున్నాయి. ఇక ఈ వ్యర్థాలు ప్లాస్టిక్ కంటే డేంజర్ అని అంటున్నారు శాస్త్రవేత్తలు.



 అయితే మాస్కు భూమిలో అసలు కరిగి పోదని వందల ఏళ్ళ వరకు అలాగే ఉంటుందని పర్యావరణ వేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమం లోనే ప్రపంచ దేశాలు మాస్క్ వ్యర్థాల నుంచి పర్యావరణంని రక్షించడం పై దృష్టి పెట్టాలి అంటు పర్యావరణ వేత్తలు సూచిస్తున్నారు. మాస్క్ వ్యర్థాలను భూమి లో పాతి పెట్టకుండా.. మాస్క్ లను పూర్తిగా కాల్చివేసి వాయు కాలుష్యం జరగకుండా ప్రత్యామ్నాయాల పై ఆలోచించాల్సిన అవసరం ఉందని పర్యావరణ వేత్తలు అన్ని దేశాల ప్రభుత్వాలను హెచ్చరిస్తున్నారు. మరి రానున్న రోజుల్లో ప్రపంచ దేశాలు మాస్క్ వ్యర్ధాల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: