
నేరేడు పండ్లు:
ఇక డయాబెటిస్ వారికి చక్కటి ఆహారపు పండ్లు అని చెప్పవచ్చు. నేరేడు గింజల తో మరిన్ని ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా నేరేడు గింజలను ఎండబెట్టి.. పౌడర్ చేసి క్రమం తప్పకుండా ప్రతిరోజు ఉదయం గోరువెచ్చని నీటిలో కలుపుకొని పరగడుపున తాగితే మరిన్ని ఫలితాలు లభిస్తాయి. ఇకపోతే నేరేడు గింజల తో తయారుచేసిన పొడి ద్వారా మీరు టీ కాచుకుని తాగినా సరే ఫలితాలు రెట్టింపు స్థాయిలో ఉంటాయి.
మెంతులు:
మెంతులతో కూడా డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు చికిత్సను అందించవచ్చు. మధుమేహంను నియంత్రణలో ఉంచడానికి మెంతులు అనేవి చాలా చక్కగా పనిచేస్తాయి. ఇక ప్రతిరోజు రాత్రి మెంతుల్ని నీటిలో నానబెట్టాలి. ఉదయం పరగడుపున ఆ మెంతుల్ని మిక్సీ పట్టి అదే నీటిలో కలుపుకొని తాగడం వల్ల డయాబెటిస్ సమస్య అదుపులో ఉంటుంది.
అంజీర్ ఆకులు:
సాధారణంగా అంజీర్ పండ్ల తో కూడా డయాబెటిస్ ను అదుపులో చేయవచ్చు. కానీ పూర్తిగా తగ్గించుకోవాలి అంటే అంజీర్ ఆకులు ఒక మంచి మెడిసిన్ అని చెప్పవచ్చు. ప్రతి రోజూ ఉదయం పరగడుపున అంజీర ఆకులను నమిలి మింగడం వల్ల మరెన్నో లాభాలు ఉంటాయి. లేదంటే ఈ ఆకులను నీటిలో ఉడికించి ఆ నీటిని తాగినా కూడా మంచి ఫలితాలను పొందవచ్చు.