ఈ చలికాలంలో దగ్గు, జలుబు లాంటి వైరల్ ఇన్ఫెక్షన్ లె కాక దురద, దద్దుర్లు వంటి పంగల్ ఇన్ఫెక్షన్ లు ఎక్కువగా వస్తుంటాయి. అందులో ముఖ్యంగా శరీరంపై దురద సమస్య అధికంగా బాధపెడుతుంటుంది. చాలా మందికి తరచుగా చేతులు కాళ్లు వేళ్లు మధ్యలో దద్దుర్లతో కూడిన దురద వస్తువుంటుంది.ఈ
 దురదను తగ్గించుకోవడానికి ఎన్ని లోషన్ లు వాడినా ఫలితం రాదు. కానీ ఇంగ్లిష్ మందులకు బదులుగా కొన్ని ఇంట్లో ఈజీగా దొరికే వాటితోనే దురదకు ఉపశమనం కలిగించుకోవచ్చు.అవి ఏవో ఇప్పుడు తెలుసుకుందాం..

1).కోకోనట్ ఆయిల్..
కొబ్బరి నూనెకు యాంటీ పంగల్ గుణాలు అధికంగా ఉంటాయి. అందువల్ల చర్మ సమస్యలయినా దద్దుర్లు, ఎరుపు, దురద వున్న చోట రాస్తే, వాటిని క్రమంగా తగ్గించి, ఉపశమనం కలిగిస్తుంది.అంతే కాక కొబ్బరి నూనె చర్మంను హైడ్రేట్ గా , మృదువుగా ఉండెలా చేస్తుంది.దీని కోసం, స్నానం చేసిన తర్వాత పొడిగా చర్మానికి కొబ్బరి నూనెను రాస్తే,పగుళ్ళు తగ్గిస్తుంది.


2). ఐస్‌ వాటర్..
మరీ ఎక్కువగా దురద సమస్య బాధపడుతూ ఉంటే, ఐస్ క్యూబ్‌లను కాటన్ క్లాత్‌లో ఉంచి, దురదపై మెల్లగా రాస్తూ ఉంటే, వాటి వల్ల కలిగే మంటను తగ్గించుకోవచ్చు.

3). కాలమైన్ లోషన్..
ఏ కారణం చేతనైనా దురద వస్తున్నా కాలమైన్ లోషన్ నే వైద్యులు సూచిస్తుంట. ఇది తొందరగా దురదకు విరుగుడుగా పని చేస్తుంది.

4). కలబంద గుజ్జు..
దద్దుర్ల తో కూడిన దురదతో బాధపడుతుంటే,ఆ ప్రదేశంలో మన ఇంటి ఆవరణలో ఉండే కలబంద గుజ్జు రాసి బాగా మసాజ్ చేస్తే సరి.కలబంద గుజ్జు ను రోజుకు రెండుసార్లు దురదపై రాయాలి.దీనికి చర్మాన్ని మృదువుగా మార్చే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలను అధికంగా ఉంటాయి.దురదను తగ్గించడంలో ఉత్తమంగా పనిచేస్తుంది.

5). నిమ్మరసం..
నిమ్మరసంలో యాంటీమైక్రోబయల్ ఎలిమెంట్స్ ఉంటాయి.నిమ్మ రసం ఒక స్ఫూన్ తీసుకొని, ఒక స్ఫూన్ నీళ్లు వేసి కలిపి దద్దుర్ల పై రాయాలి. ఇది రాసిన తర్వాత మంటగా అనిపించినా, తొందరగా ఉపశమనం కలిగిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: