మనలో చాలా మంది కూడా పాదాల నొప్పులతో ఎంతగానో బాధపడుతూ ఉంటారు. వీటికి కారణాలు చాలా ఉంటాయి. వాటిలో బరువు పెరగడం, ఎక్కువసేపు నిలబడటం, ఎత్తు మడమల బూట్లు, చెప్పులు ధరించడం ఇంకా శరీరంలో కాల్షియం లోపించటం మొదలైనవి కారణాలుగా చెప్పుకోవచ్చు. నొప్పిని తగ్గించుకోవడానికి వివిధ రకాల మందులు తీసుకుంటూ ఉంటారు.. అయినా కానీ నొప్పి మళ్లీ మాములుగానే వస్తుంది. ఈ పరిస్థితిలో కొన్ని ఇంటి నివారణల చిట్కాలు పాటిస్తే పాదాల నొప్పి నుండి  ఉపశమనం పొందవచ్చు. అవేంటో తెలుసుకునే తెలుసుకుందాం.పాదాల నొప్పి సమస్య నుండి బయటపడటానికి నొప్పి ఉన్న ప్రాంతంలో రోజుకు కనీసం మూడు నుండి నాలుగు సార్లు ఐస్ క్యూబ్ లు ఉంచాలి. ఐస్ గడ్డను నేరుగా కాకుండా ఒక గుడ్డలో ఉంచి నొప్పి ఉన్న ప్రదేశంలో సున్నితంగా మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల ఉపశమనం లభిస్తుంది.పాదాల నొప్పి నుండి ఉపశమనం పొందడానికి నొప్పి ఉన్న ప్రాంతంలో లవంగం నూనెతో మసాజ్ చేయాలి.


ఇలా చేయడం వల్ల రక్త ప్రసరణ పెరుగుతుంది. కండరాలకు ఉపశమనం కలుగుతుంది. పాదాలలో ఏదైనా నొప్పి అనిపిస్తే లవంగం నూనెతో మసాజ్ చేయటం వల్ల మంచి ఫలితం ఉంటుంది.అలాగే ఆపిల్ సైడర్ వెనిగర్ బాగా ఉపయోగపడుతుంది. కొన్ని నీటిని వేడి చేసి దానిలో కొన్ని చుక్కల ఆపిల్ సైడర్ వెనిగర్ వేసి కలపాలి. ఈనీటితో పాదాలను మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల ఉపశమనం లభిస్తుంది.ఇంకా అలాగే ఆహారంలో చేపలను చేర్చుకోవడం ద్వారా నొప్పి, మడమల వాపు నుండి ఉపశమనం పొందవచ్చు. ఇందులో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు ఉన్నాయి. ఇవి నొప్పి , వాపును తగ్గించడమే కాకుండా, ఎముకలను బలోపేతం చేస్తాయి.పాదాల నొప్పి నుండి ఉపశమనం పొందడానికి పసుపు సహాయపడుతుంది. ఇది వ్యాధి నిరోధక లక్షణాలను కలిగి ఉండి వాపును తగ్గించడంలో సహాయపడుతుంది. దీనికిగాను పసుపు నీళ్లలో కొద్దిగా తేనె కలుపుకుని తాగాలి. అలాగే పసుపు పాలు తీసుకోవచ్చు. దీనిని సేవించటం వల్ల నొప్పి  తగ్గుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: