పళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే ఖచ్చితంగా పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే పండ్లను, కూరగాయలను ఎక్కువగా నమిలి తినాలి. ఇలా చేయడంవల్ల నోట్లో లాలాజలం ఎక్కువగా తయారవుతుంది. దీంతో నోట్లో ఉండే క్రిములు నశిస్తాయి. దంతాలపై పేరుకుపోయిన పసుపుదనం, పాచి తొలగిపోతాయి. అలాగే కాఫీ, టీ, రెడ్ వైన్ వంటి వాటిని తీసుకోవడం తగ్గించాలి. ఇవి దంతాలపై మరకలను ఏర్పరుస్తాయి. కనుక వీటిని తీసుకోవడం పూర్తిగా తగ్గించాలి. అదే విధంగా నీటిని ఎక్కువగా తాగాలి. నీటిని తాగడం వల్ల దంతాలపై మరకలు ఏర్పడకుండా ఉంటాయి.పళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు తెల్లగా చేయడంలో ఆవాల నూనె మనకు ఎంతో సహాయపడుతుంది. ఆవాల నూనెలో ఉప్పు, పసుపు వేసి కలపాలి. తరువాత ఈ మిశ్రమంతో పళ్ళను శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల నోట్లో ఉండే బ్యాక్టీరియా నశిస్తుంది. దంతాలు మరియు చిగుళ్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. దంతాలు సహజంగా తెల్లగా మారతాయి. అదేవిధంగా స్ట్రాబెరీలను ఉపయోగించడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. స్ట్రాబెరీలను పేస్ట్ గా చేసి అందులో బేకింగ్ సోడా కలిపి దంతాలను శుభ్రం చేసుకోవాలి.


స్ట్రాబెరీలలో ఉండే మాలిక్ యాసిడ్ దంతాలను తెల్లగా మార్చడంలో సహాయపడుతుంది. అలాగే రోజూ దంతాలను శుభ్రం చేసుకునే ముందు ఒక నిమిషం పాటు దంతాలను యాపిల్ సైడర్‌ వెనిగర్ తో శుభ్రం చేసుకోవాలి.ఇలా చేయడం వల్ల దంతాలు తెల్లగా మారడంతో పాటు నోటి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.నిమ్మరసంలో బేకింగ్ సోడా వేసి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ పేస్ట్ ను దంతాలపై రాసి కొద్ది నిమిషాల పాటు అలాగే ఉంచాలి. తరువాత నీటితో సరిగ్గా శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల దంతాలపై ఉండే మరకలు, పసుపుదనం తొలగిపోయి దంతాలు తెల్లగా మారతాయి. అలాగే దంతాలను తెల్లగా మార్చడంలో యాక్టివేట్ చేసిన బొగ్గు మనకు ఎంతో ఉపయోగపడుతుంది. బొగ్గును బ్రష్ తో తీసుకుని దంతాలను రుద్దుకోవాలి. తరువాత నీటితో పూర్తిగా శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల దంతాలపై ఉండే మరకలు, కాలుష్యకారకాలు తొలగిపోతాయి.దంతాలు తెల్లగా, ఆరోగ్యంగా మారతాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ టిప్స్ పాటించండి. పళ్ళు చాలా అందంగా ఆరోగ్యంగా ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: