
అంతేకాదు కరోనా రాకుండా ముందు నుంచి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మరింత ఉత్తమం అంటూ సూచిస్తున్నారు అధికారులు. డాక్టర్లు కూడా తగిన ఆహారాలు తీసుకోవడం మరింత మంచిది అంటూ చెప్పుకొస్తున్నారు. ఆయుర్వేదంలో ఆహారాన్ని శరీరానికి ప్రధాన భాగంగా భావిస్తూ ఉంటారు అన్న విషయం అందరికీ తెలిసిందే . సరైన ఆహారం తీసుకోవడం వల్ల శరీరం మరింత బలంగా మారి వ్యాధులతో పోరాడే సామర్థ్యం పెరుగుతుంది. ఆ కారణంగానే కరోనా సమర్థవంతంగా ఎదుర్కోవాలి అంటే కొన్ని ఆహారాలు కచ్చితంగా తీసుకోవాలి అంటున్నారు డాక్టర్లు .
అంతేకాదు రోజుకి మూడు నుంచి ఐదు లీటర్ల గోరువెచ్చని నీటిని తాగడం చాలా చాలా మంచిది అంటూ చెబుతున్నారు . మన శరీరంలో 75% నీరు ఉంటుంది కాబట్టి ప్రతి రోజు ఇలా గోరువెచ్చని నీళ్లు తాగడం వలన రోకనిరోధక శక్తి పెరుగుతుందట . స్నానానికి మాత్రం చల్ల నీటిని వాడాలి. అంతేకాదు మరీ ముఖ్యంగా ప్రతిరోజు ఒక చెంచా పసుపుని తీసుకోవాలి. ఉదయం ఎనిమిది నుంచి పది మెంతి గింజలు (రాత్రి నానబెట్టి ఉదయం తీసుకోవచ్చు).. అలాగే మెంతులను అలాగే నమిలి మింగేయొచ్చు . మరీ ముఖ్యంగా రోజుకి ఒక ఐదు తులసి ఆకులను తినడం వల్ల చిన్నపాటి ఇన్ఫెక్షన్ నుండి రక్షిస్తుంది. రక్తాన్ని బలపరచడంలో సహాయపడుతుంది . వెల్లుల్లి సరైన మోతాదులో తీసుకుంటూ ఉండటం చాలా చాలా మంచిది . నీరు ఎక్కువగా త్రాగుతూ ఉండడం ..మిరియాలు - పసుపు -అల్లం మనం వాడే వంటలలో వాడుతూ ఉండడం ద్వారా మన బాడీలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది .. తద్వారా వైరస్ అటాక్ అవ్వాలని చూసిన అంత త్వరగా అటాక్ అవ్వదు . దీనితో పాటు మిగతా జాగ్రత్తలు తీసుకుంటే కచ్చితంగా కరోనా ని సమర్థవంతంగా తరిమికొట్టొచ్చు అంటున్నారు డాక్టర్లు..!