
పాలు తాగితే నిద్ర ఎందుకు వస్తుంది?
పాలలో ట్రిప్టోఫాన్ అనే అమినో ఆమ్లం ఉంటుంది. ఇది మెదడులోకి వెళ్ళిన తర్వాత సెరటోనిన్ అనే కెమికల్‌గా మారుతుంది. సెరటోనిన్ మళ్లీ మెలటోనిన్ అనే నిద్ర హార్మోన్ ఉత్పత్తిని పెంచుతుంది. మెలటోనిన్ వల్ల శరీరానికి “నిద్ర సమయం వచ్చింది” అనే సంకేతం వెళ్తుంది. ఆ కారణంగానే పాలు తాగితాగగానే నిద్ర పట్టేస్తుంది.
కేల్షియం & మాగ్నీషియం:
పాలలో ఉన్న కేల్షియం మెదడులో ట్రిప్టోఫాన్ ని సెరటోనిన్‌గా మారే ప్రక్రియలో సహాయపడుతుంది. మాగ్నీషియం కండరాలను రిలాక్స్ చేస్తుంది. అందువల్ల మనసు ప్రశాంతంగా మారి నిద్రకు సులభం అవుతుంది.
వెచ్చని పాలు :
వేడి పాలని తాగితే శరీరానికి తేలికైన వేడి అనిపిస్తుంది. ఈ వెచ్చదనం మనసుకు శాంతి కలిగించి, రిలాక్సేషన్ పెంచుతుంది. చాలా మంది చిన్నప్పటి నుండి నిద్రపోయే ముందు పాలు తాగే అలవాటు వల్ల ఇది ఒక సైకాలజికల్ ట్రిగ్గర్ గా కూడా పనిచేస్తుంది. మనసు ఆటోమేటిక్‌గా నిద్ర మోడ్‌కి వెళ్ళిపోతుంది.
లాక్టోస్ వల్ల శక్తి తగ్గడం:
పాలలో ఉన్న లాక్టోస్ హాజమయ్యేటప్పుడు శరీరానికి తేలికైన ఎనర్జీ ఇస్తుంది. ఆ తర్వాత రక్తంలో చక్కెర స్థాయి కొంచెం తగ్గుతుంది తద్వార శరీరం రిలాక్స్ అవుతుంది .. నిద్ర సులభంగా పట్టేస్తుంది.
పాలు ఎప్పుడు తాగితే మంచిది?
రాత్రి నిద్రకు అరగంట ముందే గోరు వెచ్చగా తాగితే బాగా పనిచేస్తుంది. చల్లని పాలు కంటే వెచ్చగా తాగితే మెరుగైన ఫలితం ఉంటుంది.
పాలు త్రాగేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
లాక్టోస్ ఇన్‌టాలరెన్స్ ఉన్నవారు ..పాలు తాగితే కడుపు ఉబ్బడం, విరేచనాలు, అసౌకర్యం గా ఉంటుంది. పాలకు బదులుగా ఆల్ మండ్ మిల్క్ లేదా హల్దీ మిల్క్ వంటివి ప్రయత్నించాలి. ఎక్కువ చక్కెర కలిపితే నిద్రకు బదులుగా శక్తి పెరిగి నిద్ర దూరమవుతుంది. మొత్తం మీద, పాలు తాగితే నిద్ర రావడానికి కారణం ట్రిప్టోఫాన్ .. సెరటోనిన్ ..మెలటోనిన్ ప్రభావం .. వెచ్చని పాల సౌకర్యం ..చిన్నప్పటి అలవాటు అని చెప్పొచ్చు.