మార్చి 3వ తేదీన ఒక సారి చరిత్రలో కి వెళ్లి చూస్తే ఎంతో మంది ప్రముఖులు జననాలు ఇంకా ఎంతో మంది ప్రముఖుల మరణాలు ఎన్నో ముఖ్య సంఘటనలు జరిగాయి. మరి నేడు ఒక్కసారి చరిత్ర లోకి వెళ్లి ఈ రోజు ఏం జరిగిందో తెలుసుకుందాం రండి. 

 

 తీవ్రవాదుల కాల్పులు : పాకిస్తాన్ లోని లాహోర్ లోని గడాఫీ స్టేడియం సమీపంలో శ్రీలంక క్రికెట్ క్రీడాకారులపై తీవ్రవాదులు కాల్పులు జరిపారు. 2009 మార్చ్ మూడవ తేదీన జరిగింది. 

 

 గాంధీ నిరాహారదీక్ష : 1939 మార్చి మూడవ తేదీన బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా మహాత్మాగాంధీ ముంబైలో నిరాహార దీక్షకు పూనుకున్నారు. 

 

 అలెగ్జాండర్ గ్రహంబెల్ జననం : అమెరికాకు చెందిన ప్రఖ్యాత శాస్త్రజ్ఞుడు టెలిఫోన్ కనిపెట్టిన శాస్త్రవేత్త అయిన అలెగ్జాండర్ గ్రహంబెల్ 1847 మార్చి 3వ తేదీన జన్మించారు. 1885 సంవత్సరంలో అలెగ్జాండర్ గ్రాహంబెల్ టెలీఫోన్ ఆవిష్కరించినందుకుగాను ఫ్రెంచి ప్రభుత్వం ప్రధానం చేసే వోల్టా పురస్కారాన్ని గెలుచుకున్నారు అలెగ్జాండర్ గ్రహంబెల్. అలెగ్జాండర్ గ్రహంబెల్ చాలామందికి టెలిఫోన్ ఆవిష్కర్తగా గుర్తుంచుకున్నప్పుడికి  వివిధ రంగాలలో ఆయన ఆసక్తి కనబరిచారు.. 

 

 ఆచంట లక్ష్మీపతి జననం : ప్రముఖ ఆయుర్వేద వైద్యులు మరియు సంఘ సేవకుడు అయిన  ఆచంట లక్ష్మీపతి 1887 మార్చి 3వ తేదీన జన్మించారు. ఈయన ఆనాటి మద్రాసులోని ఆయుర్వేద వైద్య కళాశాలలో ప్రధాన ఉపాధ్యాయులు గా కూడా పని చేశారు. 

 

 రాగ్నర్ ఫ్రిష్ జననం : ప్రముఖ  ఆర్థికవేత్త అయిన రాగ్నర్ ఫ్రిష్  1897 మార్చి 3వ తేదీన జన్మించాడు. ఓస్లో  విశ్వవిద్యాలయంలో విద్యనభ్యసించిన ఈయన 1930లో ఆర్థిక సమస్యల సాధనకై గణాంక శాస్త్ర ఆధారిత ఫార్ములాను ఉపయోగించే ఎకనామిక్ శాస్త్రానికి అంకురార్పణ చేశారు. అర్థశాస్త్రంలో ఇతను చేసిన పరిశోధనలకు గానూ 1969 అర్థశాస్త్రంలో మొట్టమొదటి నోబెల్ బహుమతి జాన్ తో కలిసి పంచుకున్నారు. ఈయన జనవరి 31,1973 లో మరణించారు. 

 

 ఎం ఎల్ జయసింహ జననం : హైదరాబాద్ కు  చెందిన భారతీయ క్రికెట్ క్రీడాకారుడు ఆయన ఎమ్మెల్ జైసింహ 1939 మార్చి 3వ తేదీన సికింద్రాబాద్ లో జన్మించారు. టెస్ట్ క్రికెట్ లో భారత దేశం తరుపున ఎన్నో మ్యాచులు ఆడాడు. కుడి చేతి వాటం బ్యాట్స్మన్ అయిన  ఎమ్మెల్ జయసింహా  ఎన్నో టెస్ట్ మ్యాచ్ లలో  భారత్ తరఫున ఆడారు. 

 

 జస్పాల్  భట్టి  : సుప్రసిద్ధ హాస్యనటుడు సామాన్య ప్రజల కష్టాలను తొలగించాలని మాధ్యమంలో వ్యంగ్యంగా  ప్రదర్శించడం ద్వారా ఎంతో మంది ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న వ్యక్తి జస్పాల్  భట్టి 1955 మార్చి 3వ తేదీన జన్మించారు. ఎన్నో  జనరంజకమైన టీవీ కార్యక్రమాల ద్వారా 1990వ దశకంలో వెలుగులోకి వచ్చాడు జస్పాల్  భట్టి . 2012 సంవత్సరంలో ఈయన మరణించారు. 

 

 శంకర్ మహదేవన్ జననం : ప్రముఖ భారతీయ సంగీత స్వరకర్త మరియు గాయకుడు అయిన శంకర్ మహదేవన్ 1967 మార్చి 3వ తేదీన జన్మించారు. భారతీయ సంగీత కళాకారుల త్రయం గా గుర్తింపు పొందిన  శంకర్ మహదేవన్ ఉత్తమ నేపథ్య గాయకుడిగా నాలుగు సార్లు జాతీయ అవార్డును సొంతం చేసుకున్నారు.ఇక శంకర్ మహదేవన్ కి భారత దేశ వ్యాప్తంగా ఎంతోమంది అభిమానులు ఉన్నారు. శంకర్ మహదేవన్ సమకూర్చిన స్వరాలు ఇప్పటికీ పేపర్ గ్రీన్ గా నిలుస్తూ ఉంటాయి. ఇప్పటికీ శంకర్ మహదేవన్ ఎన్నో సినిమాలకు స్వరకర్త గా పనిచేస్తూ సినిమాలకు తన స్వరాలతో ప్రాణం పోస్తున్నారు. శంకర్ మహదేవన్ అందించిన ఎన్నో స్వరాలు ఇప్పటికీ భారత ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాయి. వివిధ భాషలలో శంకర్ మహదేవన్ తన సత్తా చాటుతూ స్వరాలను సమకూర్చారు. 

 

 జి.ఎం.సి.బాలయోగి మరణం : ఆంధ్రప్రదేశ్ కు  చెందిన పార్లమెంట్ సభ్యుడు తొలి దళిత లోక్సభ స్పీకర్ అయిన జి.ఎం.సి.బాలయోగి 2002 మార్చి 3వ తేదీన మరణించారు. ఆంధ్రప్రదేశ్ కు  రాజకీయాల్లో కీలక నేతగా ఎదుగుతూ ఎన్నో పదవులను అలంకరించారు జి.ఎం.సి.బాలయోగి.

మరింత సమాచారం తెలుసుకోండి: