ఆగస్టు 1వ తేదీన ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్లి చూస్తే ఎన్నో ముఖ్య సంఘటనలు ఎంతో మంది ప్రముఖుల జననాలు ఇంకెంతో మంది ప్రముఖుల మరణాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్లి నేడు జన్మించిన ప్రముఖులు సంభవించిన మరణాలు జరిగిన ముఖ్య సంఘటనలు ఏంటో తెలుసుకుందాం రండి.


గళ్ళ అరుణ కుమారి జననం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి అయిన గళ్ళ అరుణ కుమారి 1949 ఆగస్టు 1వ తేదీన జన్మించారు. అరుణ కుమారి అమరరాజా సంస్థ వ్యవస్థాపకుడు పారిశ్రామికవేత్త అయిన డాక్టర్ గల్లా రామచంద్ర నాయుడు ను వివాహం చేసుకున్నారు. ఈమె కుమారుడు గల్లా  జయదేవ్ కూడా ఆంధ్ర రాజకీయాల్లో కీలక నేతగా ఉన్నారు . గల్లా అరుణకుమారి తన రాజకీయ జీవితంలో ఎన్నో పదవులను అలంకరించారు.


 అరుణ్ లాల్ జననం : భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు అయిన అరుణ్ లాల్  భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. ఈయన  1955 ఆగస్టు ఒకటో తేదీన జన్మించారు. భారత క్రికెట్ జట్టులో 26.03 సగటుతో కొనసాగారు అరున్ లాల్. ఎన్నో ఏళ్ల పాటు భారత క్రికెట్ జట్టులో సేవలందించారు అరుణ్ లాల్.


తాప్సి  పన్ను జననం  : భారతీయ చలన చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటి తాప్సీ 1987 ఆగస్టు ఒకటవ తేదీన జన్మించారు. ఝుమ్మంది నాదం అనే సినిమా ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన తాప్సీ... సినీ పరిశ్రమకు రాకముందు మోడలింగ్ లో  కొనసాగేది. ఝుమ్మంది నాదం తర్వాత ఎన్నో సినిమాల్లో  నటించిన తాప్సి  మంచి గుర్తింపు సంపాదించింది.  ప్రస్తుతం తెలుగులో సినిమాలు తగ్గించినప్పటికీ... బాలీవుడ్ లో  మాత్రం నటనకు ప్రాధాన్యం ఉన్న ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేసుకుంటూ దూసుకుపోతుంది. ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుంది తాప్సి.


 కే ఎస్ రవీంద్ర జననం : తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ దర్శకుడు కేఎస్ రవీంద్ర  తెలుగు ప్రేక్షకులందరికీ బాబి  గా సుపరిచితుడు. స్క్రీన్ ప్లై రైటర్ గా..  డైరెక్టర్ గా  ఎంతగానో పేరు ప్రఖ్యాతలు సంపాదించారు బాబీ. తెలుగు చిత్ర పరిశ్రమలో  పలు సినిమాలను తెరకెక్కించి మంచి గుర్తింపు సంపాదించారు బాబీ అలియాస్ కేఎస్ రవీంద్ర . 1983 ఆగస్టు ఒకటో తేదీన జన్మించారు ఈయన.


బాలగంగాధర్ తిలక్ మరణం : ప్రముఖ భారత జాతీయోద్యమ నాయకుడు అయిన బాలగంగాధర్ తిలక్ 1920 ఆగస్టు ఒకటవ తేదీన పరమపదించారు. స్వతంత్ర ఉద్యమానికి కొత్త ఒరవడిని తొక్కించిన బాలగంగాధర్ తిలక్  ఎంతో మంది ప్రజలను జాతీయోద్యమం వైపు అడుగులు వేసేలా  ప్రభావితం చేశారు బాలగంగాధర్ తిలక్.


పీవీ రంగారావు మరణం : మాజీ శాసనసభ్యుడు,  మాజీ ప్రధానమంత్రి అయిన పీవీ నరసింహారావు పెద్ద కుమారుడు ఆయన పీవీ రంగారావు 2013 ఆగస్టు ఒకటవ తేదీన మరణించారు.

Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: