గడిచిన కాలములో మానవుని చర్యల యొక్క అధ్యయనమే చరిత్ర. ఎన్నో విశేష‌ణ‌ల స‌మ‌హార‌మే చ‌రిత్ర‌. నాటి ఘ‌ట‌న‌లను..మాన‌వుడు న‌డిచి వ‌చ్చిన బాట‌ల‌ను స్మ‌రించుకోవ‌డానికే చ‌రిత్రే. ప్ర‌పంచ మాన‌వాళి ప‌రిణామ క్ర‌మంలో అక్టోబ‌ర్ 3వ ‌తేదీకి ఎంతో ప్రాధాన్యం ఉంది.  హెరాల్డ్ అందిస్తున్న ఆ విశేషాలు మీకోసం


ముఖ్య సంఘటనలు


1860: బ్రిటిష్ ప్రభుత్వం, 17 ఆగష్టు 1860 నాడు పోలీస్ కమిషన్ ఏర్పాటు చేసింది. పోలీస్ కమిషన్ తన, నివేదికను 3 అక్టోబర్ 1860, నాడు సమర్పించింది. భారతదేశం లోని పోలీసు సంస్థల గురించిన వివరాలు సేకరించటము, పోలీసు వ్యవస్థలో కొన్ని సంస్కరణలను చేయటము, ఉన్న వాటిని అభివృద్ధి చేయటము గురించి సలహాలు ఇవ్వటము ఈ పోలీసు కమిషన్ విధులు. పోలీస్ కమిషన్ రిపోర్ట్ 1860 చూడు. దీని ఆధారంగానే, నేటికీ అమలులో ఉన్న పోలీస్ చట్టము 1861 ఏర్పడింది.
1990: పశ్చిమ జర్మనీ, తూర్పు జర్మనీలు ఏకమై ఐక్య జర్మనీగా ఏర్పడ్డాయి.
1955: మద్రాసు వద్ద గల పెరంబూరు లోని ఇంటెగ్రల్ కోచ్ ఫాక్టరీ నుండి, మొట్ట మొదటి రైలు పెట్టె ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ చేతుల మీదుగా విడుదలైంది.
2005: వర్తుల సూర్యగ్రహణం (యాన్యులర్ సొలార్ ఎక్లిప్స్) ఏర్పడింది.
2013: తెలంగాణ ఏర్పాటుకు కేంద్ర మంత్రిమండలి ఆమోదించింది.



జననాలు

1903: స్వామి రామానంద తీర్థ, స్వాతంత్ర్య సమరయోధుడు, హైదరాబాదు సంస్థాన విమోచనానికి పాటు బడ్డ మహానాయకుడు. (మ.1972).స్వామి రామానంద తీర్థ బాల్యనామం వెంకటేష్ భావు రావు ఖెడ్గేకర్. ఈయన అక్టోబర్ 3, 1903లో గుల్బర్గా జిల్లా, జాగిర్ గ్రామంలో జన్మించారు. ఆయన తండ్రి సన్యాసం స్వీకరించటంతో బంధువుల ఔదార్యంతో తన విద్యాభ్యాసాన్ని సాగించవలసి వచ్చింది. లోకమాన్య బాల గంగాధర తిలక్‌ను ఈయన ఆదర్శంగా తీసుకున్నాడు. గాంధీజీ ప్రారంభించిన సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొని బడికి గాంధీ టోపి వేసుకుని వెళ్ళి తన నిరసన తెలిపి కొంత కాలం చదువుకు సెలవిచ్చాడు. తరువాత కాంగ్రెస్లో చేరాడు. తన ఇరవై ఒకటో యేడాది తరువాత చదువుపై దృష్టి పెట్టి ఎం ఏ పట్టా సాధించాడు.
1924: ఎం.ఎస్.ఆచార్య, పాత్రికేయుడు. జనధర్మ, వరంగల్ వాణి పత్రికల స్థాపకుడు. (మ.1994)
1926: నారాయణరావు పవార్, తెలంగాణా విమోచనోద్యమ నాయకుడు. (మ.2010)
1988: కాశి రాజు, వర్థమాన కవులలో ఒకడు, కవిసంగమంలో గ్రూప్ కవితలు వ్రాస్తున్నాడు.



మరణాలు

1992: దిగవల్లి వేంకటశివరావు, స్వాతంత్ర్య యోథుడు, సాహిత్యాభిలాషి, అడ్వకేటు. (జ.1898)
2006: ఇ.వి.సరోజ, 1950, 60 వ దశకాలలో పేరొందిన చెందిన తమిళ, తెలుగు సినిమా నటి, నాట్య కళాకారిణి. (జ.1935)

మరింత సమాచారం తెలుసుకోండి: