గడిచిన కాలములో మానవుని చర్యల యొక్క అధ్యయనమే చరిత్ర. ఎన్నో విశేష‌ణ‌ల స‌మ‌హార‌మే చ‌రిత్ర‌. నాటి ఘ‌ట‌న‌లను..మాన‌వుడు న‌డిచి వ‌చ్చిన బాట‌ల‌ను స్మ‌రించుకోవ‌డానికే చ‌రిత్రే. ప్ర‌పంచ మాన‌వాళి ప‌రిణామ క్ర‌మంలో అక్టోబ‌ర్ 25వ ‌తేదీకి ఎంతో ప్రాధాన్యం ఉంది.  హెరాల్డ్ అందిస్తున్న ఆ విశేషాలు మీకోసం

ముఖ్య సంఘటనలు

1951: భారత దేశపు మొట్ట మొదటి సార్వత్రిక ఎన్నికలు మొదలయ్యాయి.
1971: ఐక్యరాజ్య సమితిలో చైనాకు సభ్యత్వం.


ప్ర‌ముఖుల జననాలు

1800: మొదటి లా కమిషన్ ఛైర్మన్, ఇండియన్ పీనల్ కోడ్ 1860 సృష్టికర్త.లార్డ్ మెకాలే (థామస్ బాబింగ్టన్ మెకాలే, ఫస్ట్ బేరన్ మెకాలే పి.సి. (జ 1800 అక్టోబర్ 25 మరణం 1859 డిసెంబరు 28) ). (ఇతడే భారత దేశంలో ఆంగ్ల విద్యాబోధనకు పునాది వేసిన వాడు).
1921: టి.వి.రాజు, తెలుగు, తమిళ, కన్నడ సినిమా సంగీత దర్శకుడు. (మ.1973). కన్నడ సినీ రంగములో కూడా పనిచేశాడు. ఈయన అంజలీదేవి నృత్యప్రదర్శనలకు హార్మోనియం వాయించేవాడు. తోటకూర వెంకటరాజు రాజమహేంద్రవరం తాలూకా రఘుదేవపురంలో జన్మించాడు. స్వగ్రామంలోనే నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్యులు గారి వద్ద సంగీతాన్ని అభ్యసించాడు. మాస్టర్ వెంకటరాజు అన్న పేరుతో రంగస్థల నటునిగా మద్రాసులో స్థిరపడ్డాడు. నటించిన సినిమాలు : పల్లెటూరి పిల్ల (1950)లో గూఢచారిగా, పిచ్చి పుల్లయ్య (1953)లో న్యాయమూర్తిగా, బంగారుపాప (1954)లో డాక్టర్‌గా, పాండురంగ మహాత్మ్యం (1957)లో ‘కృష్ణా ముకుందా మురారి’ అనే పాటలో భక్తునిగా కనిపిస్తారు.
1929: వెంపటి చినసత్యం, కూచిపూడి నాట్యాచార్యుడు. (మ.2012)
1964: కలేకూరు ప్రసాద్, సినీ గేయరచయిత, సాహితీ విమర్శకుడు, మార్క్సిస్టు విశ్లేషకుడు ప్రజాకవి.
1988 : శక్తిశ్రీ గోపాలన్, భారతీయ గాయని, గీత రచయిత్రి.
1987 : ఉమేష్ యాదవ్ భారతీయ క్రికెట్ ఆటగాడు.

ప్ర‌ముఖుల మరణాలు

1999: సాలూరు రాజేశ్వరరావు, తెలుగు చలనచిత్ర చరిత్రలో సంగీత దర్శకుడు (జ.1922).
2003: కిడాంబి రఘునాథ్, శాస్త్రవేత్త, పత్రికా సంపాదకుడు (జ.1944).
2009: తంగి సత్యనారాయణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ మాజీ సభాపతి (జ.1931).
2015: జస్పాల్ భట్టి, హాస్య, వ్యంగ్య టెలివిజన్ కళాకారుడు. (జ.1955)

మరింత సమాచారం తెలుసుకోండి: