తెలుగు సినిమా చరిత్రలో ఐదు దశాబ్దాలకు పైగా తిరుగులేని సామ్రాజ్యాన్ని ఏలుతున్న వంశం ఏదైనా ఉందంటే అది నందమూరి వంశం! తాత నందమూరి తారక రామారావు... తండ్రి నటసింహం బాలకృష్ణ... ఆ ఇద్దరి నట వారసత్వాన్ని మోయబోయే యంగ్ లయన్ కోసం ఇప్పుడు యావత్ సినీ ప్రపంచం ఊపిరి బిగబట్టి చూస్తోంది. ఆయనే నందమూరి మోక్షజ్ఞ తేజ! ఎంట్రీపై ఎందుకీ సస్పెన్స్? ఫ్యాన్స్ ఆశలపై నీళ్లు చల్లొద్దు! .. ‘టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ ఎంట్రీ’ ఎవరిదంటే.. అది కేవలం మోక్షజ్ఞదే! అదిగో వస్తున్నాడు.. ఈ ఏడాది పక్కా.. ఆ డైరెక్టర్, ఈ డైరెక్టర్ అంటూ కొన్నేళ్లుగా ఎన్నో గాసిప్స్, మరెన్నో పుకార్లు! కానీ, మోక్షు తొలి సినిమా ముహూర్తం మాత్రం ఇప్పటికీ ఖరారు కాలేదు. పరిస్థితి చూస్తుంటే... ఈ ఏడాది కూడా మోక్షజ్ఞ ఎంట్రీ లేనట్టేనని వస్తున్న వార్తలు నందమూరి అభిమానులను తీవ్ర ఆందోళనలోకి నెడుతున్నాయి.


సింహాసనంపై కూర్చోవాల్సిన యువరాజు ఆలస్యం అవుతుండటంతో... అసలు ఎంట్రీ ఉంటుందా ఉండదా అనే గుబులు నందమూరి ఫ్యాన్స్‌ను కలవరపెడుతోంది. హనుమాన్ దర్శకుడితో ప్లాన్... కానీ షాకిచ్చిన బ్రేక్! .. ఆ మధ్య ఓ సూపర్ హిట్ న్యూస్ వచ్చింది. 'హనుమాన్' సినిమాతో సంచలనం సృష్టించిన యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో మోక్షజ్ఞ లాంచ్‌కి బాలయ్య బాబు ఓకే చెప్పారని, అప్పుడు ఫస్ట్‌లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారని నందమూరి అభిమానులు సంబరాలు చేసుకున్నారు. కానీ.. అనుకోకుండా ఆ ప్రాజెక్టు శబ్దమే లేకుండా ఆగిపోయింది! దాదాపు ఏడాదిగా ఆ సినిమాను పక్కన పెట్టేయడం ఫ్యాన్స్‌కు తీవ్ర నిరాశను మిగిల్చింది. మరి ఆ ప్రాజెక్టుకు తిరిగి ప్రాణం పోస్తారా? లేక మరేదైనా కొత్త ప్రాజెక్టు ప్రకటిస్తారా? అనే సస్పెన్స్ కొనసాగుతోంది.

 

మాస్ కా కమర్షియల్ కావాలి! వయసు పెరుగుతున్నా వాయిదా దేనికి? .. ఒకవైపు... మోక్షజ్ఞకు లవ్ స్టోరీతో ఎంట్రీ ఇవ్వాలనే ఆసక్తి ఉందని నారా రోహిత్ లాంటి సన్నిహితులు చెబుతుంటే... మరోవైపు బాలయ్య బాబు మాత్రం తాను డైరెక్ట్ చేయబోయే 'ఆదిత్య మ్యాక్స్' సినిమా ద్వారానే పరిచయం చేస్తానని అంటున్నారు. కానీ... నందమూరి అభిమానుల డిమాండ్ మాత్రం ఒకటే! అది... తొలి సినిమానే మాస్ కమర్షియల్ ధమాకా కావాలని! గత నెలలోనే మోక్షజ్ఞ 31వ పడిలో అడుగుపెట్టారు. ఇక ఆలస్యం చేయకుండా... బాక్సాఫీస్ లెక్కలు మార్చే ఓ పవర్ ఫుల్ ప్రాజెక్టును తండ్రీకొడుకులు ప్రకటించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కాస్త ఆలస్యం అయినా సరే... మోక్షు ఎంట్రీ సినిమాతోనే బాక్సాఫీస్‌ను షేక్ చేసి సంచలనం సృష్టిస్తాడు అనేది 'యంగ్ లైన్'ను దగ్గర నుంచి చూసిన వారి మాట. ఆ రోజు కోసం వేచి చూద్దాం! జై బాలయ్య! జై మోక్షజ్ఞ!

మరింత సమాచారం తెలుసుకోండి: