దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళిసూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ యాక్షన్–ఫిక్షన్ చిత్రం #SSMB29 వర్కింగ్ టైటిల్‌తో షూటింగ్‌లో ఉంది. శనివారం సాయంత్రం రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన అద్భుతమైన #Globe trattor ఈవెంట్‌లో ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక టైటిల్‌ను గ్రాండ్‌గా విడుదల చేసిన విషయం తెలిసిందే. అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నట్టుగానే ఈ చిత్రానికి ‘వారణాసి’ అనే శక్తివంతమైన టైటిల్‌ను జక్కన్న ప్రకటించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. టైటిల్‌తో పాటు విడుదల చేసిన గ్లింప్స్‌ మరియు మహేశ్ బాబు లుక్ సోషల్ మీడియాలో శనివారంనుంచే ట్రెండ్ అవుతున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో స్పెషల్ వీడియోను టీమ్ విడుదల చేయగా… ఆ వీడియో చూసిన అభిమానులు నిజంగా గూస్‌బంప్స్‌తో మునిగిపోయారు. “ఈ వీడియో చూసాక 2027 వరకూ ఎలా ఆగగలం?” అంటూ కామెంట్స్  చేస్తున్నారు.


రుద్రరూపంలో మహేశ్ — నంది వాహనంపై గ్రాండ్ ప్రెజెన్స్:

ఈ వీడియోలో మహేశ్ బాబు పూర్తిగా దివ్యరూపంలో కనిపించారు. రుద్ర తేజంతో మెరిసే కళ్లతో, శక్తివంతమైన అవతారంలో, నంది వాహనంపై కూర్చొని కనిపించిన లుక్ అభిమానులను పూర్తిగా ఫిదా చేసింది. “మహేశ్ ఇంతగా మారిపోతాడా?” అని ఆశ్చర్యపోతూ, “ఉగ్రరూపంలో మహేశ్‌ని చూడడానికి రెండు కళ్లూ సరిపోవు” అంటూ ఫ్యాన్స్ ఎమోషనల్ అవుతున్నారు.

ఒకే ఈవెంట్‌లో ఐదు మెగా అప్‌డేట్స్ — జక్కన్న స్టైల్‌నే వేరే!

రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన గ్లోబ్‌ట్రాటర్ ఈవెంట్ మాత్రం సినిమా ఈవెంట్లకు కొత్త బెంచ్‌మార్క్‌గా నిలిచింది. రాజమౌళి కెరీర్‌లో కూడా ఇంత భారీగా, ఇంత వరుస అప్‌డేట్స్‌ను ఒకే స్టేజ్‌పై విడుదల చేయడం ఇదే మొదటిసారి. ఈ ఈవెంట్‌లో:

*టైటిల్ రివీల్ – వారణాసి

*మహేశ్ మైండ్‌బ్లోయింగ్ లుక్ విడుదల

*క్యారెక్టర్ రివీల్

*రివీల్ డేట్ ప్రకటించడం

*స్పెషల్ వీడియో విడుదల

ఇలా మొత్తం ఐదు భారీ సర్‌ప్రైజ్‌లను ఒకే ఈవెంట్‌లో ప్రకటించడం ఫ్యాన్స్‌ను ఆనందంతో ఉప్పొంగేలా చేసింది.

త్రేతాయుగం – హనుమంతుడు – రాముడి ప్రస్తావన: అంచనాలు అట్టుడుకుతున్నాయి

టైటిల్ గ్లింప్స్‌లో కనిపించిన పురాణ సూచనలు… త్రేతాయుగం, హనుమంతుడు, రాముడి ప్రస్తావనలు అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని రేకెత్తించాయి. “ఇది సాధారణ సినిమా కాదని… ఒక మహా ఇతిహాసం రాబోతోందని” ఫ్యాన్స్ ఇప్పటికే భావిస్తున్నారు. మహేశ్ కెరీర్‌లోనే కాదు, భారతీయ సినిమాకి కూడా కొత్త డెఫినిషన్ ఇచ్చే చిత్రమవుతుందనే అభిప్రాయం పెరుగుతోంది.



మొత్తానికి…

రాజమౌళి ఇచ్చిన వరుస గిఫ్ట్‌లతో అభిమానులు ప్రస్తుతం సోషల్ మీడియాను అతలాకుతలం చేస్తున్నారు. ‘వారణాసి’ కోసం వేచి ఉండడం ఇక భరించలేకపోతున్నామంటూ కామెంట్లు కురిపిస్తున్నారు. జక్కన్న మాత్రం తన మార్క్‌తో, ఒక్క ఈవెంట్‌కే పదిమూసలు పగలగొట్టే అప్‌డేట్స్ ఇచ్చి… ఫ్యాన్స్‌కు నిజంగానే 2027 వరకూ కొనసాగిపోయే థ్రిల్‌ను గిఫ్ట్ చేశారు.



మరింత సమాచారం తెలుసుకోండి: