1274 వ సంవత్సరంలో ఇంగ్లాండ్ రాజుగా ఎడ్వర్డ్- I పట్టాభిషేకం జరిగింది.

1833 వ సంవత్సరంలో కెనడాకు చెందిన రాయల్ విలియం అనే పేరు గల మొదటి ఓడ (ఆవిరి శక్తితో నడిచే ఓడ) నోవా స్కోటియా నుంచి ది ఐస్ల్ ఆప్ విఘట్ వరకూ కేవలం పూర్తిగా తన ఆవిరి శక్తితోనే, ప్రయాణించి అట్లాంటిక్ మహాసముద్రాన్ని దాటడం జరిగింది. ఇక ఆ ఓడ..నొవా స్కొటియా నుంచి ప్రయాణం మొదలుపెట్టిన రోజు ఈ రోజు..

1835 వ సంవత్సరంలో మసాచుసెట్స్ లోని స్ప్రింగ్‌ఫీల్డ్కి చెందిన సోలిమన్ మెర్రిక్, మనం వాడుతున్న రెంచ్కి పేటెంట్ పొందడం జరిగింది.

1868 వ సంవత్సరంలో గుంటూరులో సంపూర్ణ సూర్య గ్రహణాన్ని చూస్తూ పియరీ జూల్స్‌ సీజర్‌ హాన్సెన్‌ అనే శాస్త్రవేత్త హీలియం ఉనికిని కనుగొనడం జరిగింది.

1891వ సంవత్సరంలో అమెరికాలోని న్యూయార్క్ నగరంలో మొట్టమొదటి సారిగా ప్రజల కోసం స్నానాల గది" ని ఏర్పాటు చేయడం జరిగింది.

1903 వ సంవత్సరంలో మొట్టమొదటి పులిట్జర్ బహుమతి ఇచ్చిన రోజు ఈ రోజు. కొలంబియా యూనివర్సిటీకి జోసెఫ్ పులిట్జర్ మిలియన్ డాలర్లు దానం. ఇక ఈ డబ్బును పులిట్జర్ బహుమతి కి అలాగే నిధిగా వాడుకుంటూ దానం చేసిన జోసెఫ్ పులిట్జర్ పేరు మీదుగా ఇక ఈ బహుమతికి పులిట్జర్ పేరు మీదుగా బహుమతులు ఇవ్వటం మొదలు పెట్టడం జరిగింది.

1915 వ సంవత్సరంలో టెక్సాస్ లోని గాల్వెస్టన్ నగరాన్ని హరికేన్ (తుఫాను) తాకి 275 మంది మరణించడం జరిగింది.

1915 వ సంవత్సరంలో డెట్రాయిట్ నగరానికి చెందిన ఛార్లెస్ ఎఫ్.. కెట్టెరిన్గ్ ఎలెక్ట్రిక్ ఆటోమొబైల్ సెల్ఫ్-స్టార్టర్ కి పేటెంట్ పొందడం జరిగింది.

1959 వ సంవత్సరంలో 7.5 మేగ్నిట్యూడ్ మీద జరిగిన భూకంపం వలన క్వేక్ లేక్ ఏర్పడటం జరిగింది. ఇక ఈ భూకంపం వలన ఏర్పడిన సరస్సు కాబట్టి, "భూకంప సరస్సు" (క్వేక్ లేక్) అని పేరు పెట్టడం జరిగింది.

1960 వ సంవత్సరంలో గాబన్ దేశపు స్వాతంత్ర్య్య దినోత్సవము ఈ రోజు.

1999 వ సంవత్సరంలో టర్కీలో జరిగిన భూకంపంలో (7.4 మేగ్నిట్యూడ్), 17, 000 మందికి పైగా మరణించడం జరిగింది.

2006 వ సంవత్సరంలో నెట్‌వర్క్ సమస్యల కారణంగా వికిమీడియా సర్వర్లు 3 గంటలపాటు పనిచేయలేదు.

2008 వ సంవత్సరంలో పాకిస్తాన్ అధ్యక్షుడు ముషారఫ్ తన రాజీనామాను ప్రకటించడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: