పిల్లలు రోజంతా ఆడిన ఆటలు చేసిన పనులు, గురించి నిద్రలో కలవరిస్తుంటారు. నిద్రలో వాళ్లకు ఇష్టమైనవి, గుర్తొచ్చినప్పుడు కూడా ఇలాగే చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల వారి చిన్ని చిన్ని మెదళ్ల లో ఉండే భారం తగ్గుతుంది. అయితే, ఈ కలవరింతలు మరీ ఎక్కువగా ఉంటే మాత్రం పక్కనే ఉండి దగ్గరగా తీసుకుని ఒళ్లో పడుకోబెట్టుకుని మృదువుగా వారిని జో కొట్టాలి.