1)మామ కాని మామ, ఎవ్వరది?  2) చుట్టింటికి మొత్తే లేదు 3)నల్లబండ కింద నలుగురు దొంగలు  4)అమ్మ అంటే కలుస్తాయి, నాన్న అంటే కలవవు  5)అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది, మా ఇంటికొచ్చింది, తైతక్కలాడింది.  6) తెల్లటి బంతి చల్లని బంతి అందని బంతి ఆడని బంతి 7) దేశదేశాలకు ఇద్దరే రాజులు 8) చిటారు కొమ్మన మిఠాయి పొట్లం  9) తోకలేని పిట్ట తొంబై ఆమడలు పోతుంది. 10) అరచెయ్యంత పట్నంలో అరవై గదులు, గదికొక్క సిపాయి, సిపాయికొక్క తుపాకి  11) వంగి వంకల రాజు, వళ్లంతా బొచ్చు  12) ఇల్లంతా తిరుగుతుంది, మూలన కూర్చుంటుంది. 13) పిడికెడంత పిట్ట ! అరిచి గోల చేస్తుంది. ఎత్తుకుంటే చెవిలో గుసగుసలు చెబుతుంది. 14) మూడు కళ్ల ముసలిదాన్ని నేనెవరిని? 15) బంగారు భరిణలో రత్నాలు, పగల గొడితేగాని రావు 16)పాంచిన దెయ్యం పోయిన చోటికల్లా వస్తుంది.?  జవాబులు :    1)చందమామ   2) కోడిగుడ్డు  3) గెదే కింద పొదుగులు   4) పెదవులు   5)కవ్వము 6) జాబిలి 7) సూర్యుడు, చంద్రుడు   8)తేనెపట్టు  9) ఉత్తరం  10)పొలం గట్టు 12) చీపురు 13) దూరవాణి 14) తాటిముంజ 15) దానిమ్మపండు 16) తన నీడ  

మరింత సమాచారం తెలుసుకోండి: