మ‌న‌దేశంలో వెయ్యి మంది పిల్ల‌లు పుడితే అందులో యాభైఏడుమంది మొద‌టిపుట్టిన‌రోజు జ‌రుపుకోకుండానే చ‌నిపోతున్నారు. ఆ యాభైఏడుమందిలో న‌ల‌భై మంది మొద‌టి నెల‌ల‌తోనేమ‌ర‌ణిస్తున్నారు. వీరిలోస‌గం పుట్టిన వారం లోపే క‌న్నుమూస్తున్నారు.  వీరిలో కూడా చాలా మంది పుట్టిన ఒక‌టి, రెండురోజుల లోపే క‌న్నుమూస్తున్నారు. ఈ చేదు వాస్త‌వాల వెనుక చంటిబిడ్డ‌ల‌పై మ‌న‌కు స‌రైన అవ‌గాహ‌న లేక‌పోవ‌డ‌మే ప్ర‌ధాన కార‌ణంగా చెబుతారు వైద్య నిపుణులు. చంటిబిడ్డ పుట్టినప్పుడు మొద‌టి వారం రోజులు చాలా కీల‌క‌మైన రోజులు. పిల్ల‌ల సంర‌క్ష‌ణ‌లో ఏం చేయాలి. బిడ్డ‌పుట్ట‌గానే ఏం చూడాలి అన్న‌వి ఈ రోజు బుడుగు శీర్షిక‌లో తెలుసుకుందాం. 

 

సాధార‌ణంగా పిల్ల‌లు పుట్ట‌గానే ముందుగా ఆ బిడ్డ త‌ల్లిదండ్రులు బంధుమిత్ర‌లు అంద‌రూ చూసేది పుట్టిన బిడ్డ తెల్ల‌గా ఉందా న‌ల్ల‌గా ఉందా... పుట్టిన బిడ్డ త‌ల్లిపోలిక లేక తండ్రి పోలిక ముక్కు బావుందా లేదా అనేవి ఎక్కువ‌గా చూస్తుంటారు. నిజానికి పుట్టిన బిడ్డ రంగు, పోలిక‌లు చూసేకంటే కూడా ముందుగా చూడ‌వ‌ల‌సిన‌ది పుట్టిన బిడ్డ స‌రైన బ‌రువులో పుట్టాడా లేదా అన్న‌ది చాలా ప్ర‌ధాన కార‌ణం అని అంటున్నారు. అలాగే త‌ల చుట్టుకొల‌త ఎలా ఉంది అన్న విష‌యం కూడా చూడ‌వ‌ల‌సి ఉంటుంది. ఎందుకంటే త‌ల‌చుట్టుకొల‌త చిన్న‌గా ఉన్నా లేదా మ‌రీ పెద్ద‌గా ఉన్నా జెన్యు ప‌ర‌మైన లోపాల వ‌ల్ల వ‌స్తుంటాయి కాబ‌ట్టి దానికి స‌రైన చికిత్స చేయ‌వ‌ల‌సి ఉంటుంది. ఇంకా చూపు స‌రిగానే ఉందా మెల్ల‌లాంటిది ఏమైనా ఉందా స్వాస స‌రిగా తీసుకుంటున్నారా. మెల్ల‌లాంటిది ఏమైనా ఉందా ఇలాంటివ‌న్నీ చూడాలి. రెండోది శ్వాస‌తీసుకునే సమ‌యంలో న‌ల్ల‌గా ఏమ‌న్నాఅవుతున్నాడా అది ముఖ్యంగా గ‌మ‌నించాలి. ఒక‌వేళ న‌ల్ల‌గా అవుతుంటే గుండెలో ఏదైనా ఇబ్బంది ఉందా...అనేది తెలియాలి.

 

అలాగే ముక్కు రంధ్రం నుంచి ఒక పైపును లోనికి పంపించి క‌డుపులోని వాటిని టెస్ట్ చేస్తారు అవి కూడా ముఖ్యంగా చేసి చూడాలి. ఇవి గ‌నుక స‌రిగా ఉంటే...మ‌నం బిడ్డ‌ను మూడు జ‌బ్బుల నుండి కాపాడ‌వ‌చ్చు. ఇప్ప‌టికి కొన్ని ప‌ల్లెటూర్ల‌లో మంత్ర‌సానులు కాన్పు చేస్తున్నారు. దాంతో పిల్ల‌ల‌కు స‌రైన టెస్టులు లేక ఇలాంటివి జ‌రుగుతున్నాయి. అదే గ‌నుక హాస్ప‌ట‌ల్‌లో జ‌రిగితే వైద్యులు ఇవ‌న్నీ ప‌రీక్షిస్తారు. మ‌గ‌బిడ్డ అయితే వృష‌ణాలు సంచిలోనే ఉన్నాయి.. అలాగే ఆడ‌బిడ్డ అయితే జ‌న‌నాంగాలు స‌రిగానే ఉన్నాయా వీపు స‌రిగా ఉందా లేదా అని అనేక విష‌యాల‌ను స‌రి చూస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: