ఫ్లూ సీజన్లో మీ పిల్లవాడు ఆడటానికి లేదా చదువుకోవడానికి బయటకు వెళ్ళినపుడు తల్లితండ్రులు ఆందోళన చెందుతారు.. బయటకు వెళ్లి ఎలాంటి అంటువ్యాధుల బారిన పడతాడో అని భయపడతారు. అలా అని ఇంట్లో ఉంటే సురక్షితంగా ఉంటాడా అన్నది కూడా చెప్పలేము. అందుకనే మీ పిల్లలను సూక్ష్మక్రిముల నుండి రక్షించడానికి ఎన్నో చిట్కాలు ఉన్నాయి. అనారోగ్యాల నుండి వారిని రక్షించడానికి ఈ అలవాట్లను మీ దైనందిన జీవితంలో చేర్చండి. అవేంటో తెలుసుకుందాం.. !!పిల్లలు తమ పెద్దలను అనుకరిస్తారు కాబట్టి,  మంచి వ్యక్తిగత పరిశుభ్రత పాటించండి. సబ్బు,  నీటిని ఉపయోగించి మీరు తరచుగా చేతులు కడుక్కోవాలని నిర్ధారించుకోండి. దయచేసి కుటుంబానికి భోజనం చేయడానికి ముందు,  తరువాత, అలాగే  బాత్రూమ్ ఉపయోగించిన తర్వత  సబ్బుతో తప్పకుండా చేతులు కడుక్కోవాలి.




పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత చేతులు కడుక్కోవడం నేర్పించండి. అలాగే ప్రతి కుటుంబ సభ్యునికి ప్రత్యేకమైన ప్లేట్స్,  గ్లాసులు, కట్లరి, టిఫిన్  ప్లేట్స్ ఉండాలి.  మంచి డిష్ వాష్ డిటర్జెంట్ ఉపయోగించి క్రమం తప్పకుండా కడగాలి. తువ్వాళ్లు లేదా పరుపులు కూడా కుటుంబ సభ్యుల మధ్య పంచుకోకూడదు. ఇతర గృహ వస్తువులను సబ్బు,  నీటితో బాగా కడగాలి లేదా ప్రతి ఉపయోగం తర్వాత క్రిమిసంహారకం  చేయాలి. అలాగే పిల్లలు దగ్గినా  లేదా తుమ్మున  ప్రతిసారీ,  నోటిని  కర్చీఫ్ లేదా మోచేయితో కప్పేలా చూసుకోండి. గది, బాత్రూమ్ లేదా వంటగది వంటి అందరూ ఉపయోగించే ప్రదేశాలు చక్కగా గాలి వెలుతురు వచ్చేలా ఉండాలి. సూక్ష్మక్రిములు 3 అడుగుల వరకు ప్రయాణించి, అవాంఛిత అంటువ్యాధులను వ్యాప్తి చేస్తాయి.  వివిధ ఉపరితలాలపై విశ్రాంతి తీసుకుంటాయి. ఇంట్లో కొన్ని ఉపరితలాలు రోజంతా కుటుంబ సభ్యులందరిచే తరచుగా తాకబడతాయి. వీటిని  హై-టచ్ ఉపరితలాలు అని కూడా పిలుస్తారు.




వీటిలో స్విచ్‌లు, డోర్ హ్యాండిల్స్, టేబుల్స్, ట్యాప్స్, క్యాబినెట్ హ్యాండిల్స్, టాయిలెట్ సీట్లు, ఫ్లష్ హ్యాండిల్స్, బొమ్మలు, ఆట పరికరాలు మొదలైనవి ఉన్నాయి. బహిరంగ ఆట స్థలంతో పాటు ప్రతిరోజూ ఈ ఉపరితలాలను శుభ్రపరచడం లాంటివి చేయాలి.  సూక్ష్మక్రిములు ఉపరితలాలపై మాత్రమే కాకుండా బట్టలపై కూడా నివసిస్తాయి. మీ పిల్లల పాఠశాల యూనిఫాంలు, మురికి ఆట బట్టలు, కుటుంబ బట్టలు సహా అన్ని బట్టలు క్షుణ్ణంగా ఉతకబడినట్లుగా  నిర్ధారించుకోండి. డిటర్జెంట్‌తో బట్టలు బాగా ఉతకడం వల్ల సూక్ష్మక్రిములు తొలగిపోతాయి.. మీ పిల్లలు, అలాగే  మీ కుటుంభం  అంటువ్యాధుల నుండి సురక్షితంగా ఉండాలంటే పైన చెప్పిన చిట్కాలను అనుసరించండి.

మరింత సమాచారం తెలుసుకోండి: