మట్టిలో ఆడుకునే పిల్లలు ఎక్కువగా నులిపురుగులు, కొంకిపురుగులు,ఎలికపాములు,టేప్ వార్మ్ బారిన తరచుగా పడి ఇన్ఫెక్షన్ కి గురవుతారు. ఇసుకలో చెప్పులు లేకుండా నడవడం, మురికి నీరుకి దగ్గర్లో ఉండటం, ఇన్ఫెక్షన్ ఉన్న ఆహారం తినడం, అపరిశుభ్ర పానీయాలు తాగడం వంటి వాటి వలన కూడా ఇవి సోకుతాయి. అలాగే సరిగ్గా ఉడకని ఆహారం లేదా శుభ్రంగా వండని ఆహారం తినటం వల్ల ఇన్ఫెక్షన్ రావచ్చు. పిల్లల చుట్టూ పరిశుభ్ర వాతావరణం ఉంచకపోతే ఇన్ఫెక్షన్లు త్వరగా వ్యాపిస్తాయి.
కడుపులో నులి పురుగులు ఉంటే మీ బిడ్డకు విటమిన్లు, పోషకాలను అందకుండా చేస్తాయి. ఫలితంగా మీ పిల్లలకు పోషకలోపం కలుగుతుంది.పోషకలోపం ఉన్న పిల్లలు మామూలు పిల్లలకన్నా తక్కువ ఆరోగ్యంగా ఉంటారు. కడుపులో నులి పురుగులు ఉన్న పిల్లలకి రోగనిరోధక శక్తి కూడా తగ్గిపోతుంది.పిల్లల్లో కడుపులో నులి పురుగుల సాధారణ లక్షణాలు ఏంటంటే పొట్ట నొప్పి, కొంచెం బరువు తగ్గటం, చిరాకు, ఆకలి లేకపోవటం, రక్తహీనత, దురద, ఆగని దగ్గు, వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలు పిల్లల్లో కనిపిస్తే వెంటనే వైద్యుడి దగ్గరకు తీసుకుని వెళ్ళాలి.అలాగే ప్రతి మూడు లేదా ఆరు నెలలకు ఒకసారి డివార్మిటైజెషన్ చేయాలి.