తల్లి దండ్రులు తగవులు పడటం, తిట్టుకోవడం  సహజమే.కానీ పిల్లలు ఉన్న ఇంట్లో  అవి పిల్లలపై చూపే ప్రభావం ఎలా ఉంటుందనే దాంట్లో చాలా తేడాలున్నాయి.తల్లి తండ్రులు గొడవలు పడడం వల్ల పిల్లలు మానసికంగా కృంగిపోతారు. ఇంట్లో జరిగే వ్యవహారాలు పిల్లల దీర్ఘకాలిక మానిసకాభివృద్ధి, ఆరోగ్యాల మీద నిజంగా ప్రభావం చూపుతాయి. తల్లిదండ్రులకు తమ చిన్నారితో సంబంధం ఎలా ఉంటుందనేదే కాదు.. తల్లిదండ్రుల మధ్య సంబంధాలు ఎలా ఉంటాయనేది కూడా చిన్నారి సంక్షేమంలో పెద్ద పాత్ర పోషిస్తాయి. మానసిక ఆరోగ్యం నుంచి చదువుల్లో రాణించటం వరకూ.. భవిష్యత్తులో చిన్నారుల సంబంధ బాంధవ్యాల వరకూ ప్రతి అంశం మీదా అవి ప్రభావం చూపగలవు.అయితే.. అన్ని గొడవలూ ఒకే రకమైన ప్రభావం చూపవు. ఒక ‘పాజిటివ్’ వివాదం మంచి ప్రభావం చూపే అవకాశమూ ఉంది. విడాకులు, విడిపోవాలని నిర్ణయించుకున్న తల్లిదడ్రుల ప్రభావం.. పిల్లల మానసిక ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీసే అవకాశం ఉంది. 




 కానీ ఇలా విడిపోవటం కన్నా గానీ  దానికి ముందు, విడిపోయే క్రమంలో, ఆ తర్వాతా తల్లిదండ్రుల మధ్య జరిగే వాగ్వాదాలే పిల్లలపై ప్రతికూల ప్రభావం చూపుతున్నట్లు ఇప్పుడు భావిస్తున్నారు. ఒక చిన్నారి మానసిక ఆరోగ్యానికి ‘స్వభావం’ అనేది కేంద్రమనేది నిజం. ఆందోళన నుంచి కుంగుబాటు, మానసిక రుగ్మత వరకూ అనేక సమస్యల్లో దీనిదే కీలక పాత్ర.అయితే.. ఇంటి వాతావరణం, అక్కడ వారు పొందే ‘శిక్షణ’ల పాత్ర కూడా చాలా ముఖ్యమైనది. ఆ తల్లిదండ్రుల మధ్య సంబంధాల నాణ్యత ఎలా ఉంది అనేదే పిల్లల మానసిక ఆరోగ్యానికి కేంద్ర బిందువుగా కనిపిస్తోంది.




అయితే  తరచుగా, తీవ్రమైన, పరిష్కారం లేకుండా ఘర్షణలు పడినపుడు అవి పిల్లల మీద ప్రతికూల ప్రభావం చూపుతాయి. ఆ గొడవలు ఆ పిల్లల గురించే అయితే ఆ ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు.. ఆ గొడవకు తామే కారణమని పిల్లలు తమను తాము నిందించుకునే పరిస్థితులు.విటివల్ల పడే ప్రతికూల ప్రభావాల్లో పిల్లలు సరిగా నిద్రపోలేకపోవటం, పసివారిలో మెదడు అభివృద్ధికి ఆటంకాలు ఏర్పడటం, ప్రైమరీ స్కూలు పిల్లల్లో ఆందోళన, నడవడిక సమస్యలు, కొంచెం పెద్ద పిల్లలు, యుక్తవయస్కుల్లో కుంగుబాటు, చదువుల్లో వెనుకబడటం, తమకు తాము హాని చేసుకోవటం వంటి ఇతర తీవ్ర సమస్యలు వంటివి ఉండొచ్చు.




మరింత సమాచారం తెలుసుకోండి: