ఆయుర్వేద వైద్యం అనేది ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో కొనసాగుతుంది.. ఇంగ్లీష్ మందుల కన్నా కూడా వనమూలికల తో చేసిన వైద్యం అనారోగ్యం నుంచి త్వరగా ఉపశనం కలిగిస్తుంది. అందుకే ఇప్పుడు మళ్లీ అందరూ పాతకాలం వైద్యం వైపు పరుగులు తీస్తున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే ఇంటి వైద్యం..వంట గదిలో ఎన్నో ఔషధాలు ఉన్నాయి..పోపుల డబ్బాలో ఉన్న ప్రతి దినుసు వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని న్యూట్రీషన్లు సూచిస్తున్నారు. 


వంటకాల్లో ఎక్కువగా సుగంధ ద్రవ్యాలను వాడుతుంటారు. ఇవి వంటకానికి మంచి రుచి, వాసనను అందిస్తాయి. అలాంటి సుగంధ ద్రవ్యాల్లో ఇంగువ ఒకటి. ఇంగువని అసఫోటిడా అని కూడా పిలుస్తారు. దీన్ని మన దేశంలో ప్రతి ఇంట్లో విరివిగా వాడుతుంటాం. ఇంగువ మంచి రుచితో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఇంగువలోని సహజ లక్షణాలు అనేక వ్యాధులను నయం చేయడానికి శక్తివంతంగా పనిచేస్తాయి. వంటకాల్లో దీన్ని వాడటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అందువల్లే, స్వచ్చమైన ఇంగువను యునాని, సిధా, ఆయుర్వేద మెడిసిన్ తయారీలోనూ ఉపయోగిస్తారు. 



ఇకపోతే ఈ ఇంగువలో యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు జీర్ణక్రియకు సంబంధించిన వ్యాధులను నయం చేయడానికి, రక్తపోటును తగ్గించడానికి ఉపయోగపడుతుంది.వంటలో నిత్యం ఇంగువను వాడటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.. 


శ్వాసకోశ సమస్యలకు పరిష్కారం:

జర్నల్ ఆఫ్ ట్రెడిషనల్ అండ్ కాంప్లిమెంటరీ మెడిసిన్లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం, ఇంగువ యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీమైక్రోబయల్ లక్షణాలను కలిగి ఉంటుందని తేలింది. ఇది శ్వాసకోశ సమస్యలను దూరం చేయడంలో సహాయపడుతుంది.


జీర్ణ క్రియను మెరుగు పరుస్తోంది: 

ఎటువంటి ఆహారం తీసుకున్నా కూడా ఈ మధ్య అరగడం లేదని చాలా మంది అంటారు..ఇంగువను ఉపయోగించడం వల్ల ఎటువంటి సమస్య తొలగిపోతుంది.


జలుబు, దగ్గు నివారణ:

ఇంగువలో ఉండే యాంటీ- అలెర్జీ కారకాలు జలుబు, దగ్గు, గొంతు సమస్యలకు పరిష్కారం చూపిస్తాయి. ఇది మన శరీరంలో వైరస్ పెరుగుదలను నియంత్రిస్తుంది. తద్వారా ఫ్లూ సమస్యల నుంచి మిమ్మల్ని కాపాడుతుంది.


జుట్టు సంరక్షణ:

ఇంగువ మీ జుట్టు రాలడం, తెల్లబడటం వంటి సమస్యలను నివారిస్తుంది. ఇది మీ జుట్టుకు గొప్ప ఎక్స్‌ఫోలియేటర్‌గా పనిచేస్తుంది. పెరుగు, తేనె వంటి ఇతర పదార్ధాలతో ఇంగువని కలిపి తీసుకుంటే మీ తలపై ఉండే తేమను తగ్గించి, జుట్టును సంరక్షిస్తుంది


వీటితో పాటుగా ఎసిడిటిని తగ్గించడం, మహిళలు నిత్యం ఇబ్బంది పడే నెలసరి సమస్య వీటన్నిటినీ పూర్తిగా తగ్గించేందుకు ఇంగువ ఉపయోగ పడుతుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: