మాల్దీవులు భారతీయులకు ఇష్టమైన ప్రదేశాలలో ఒకటి. కానీ బడ్జెట్ కాణంగా మీరు మాల్దీవులకు వెళ్లలేకపోతే తక్కువ ఖర్చుతో ఇండియాలోనే మాల్దీవుల వంటి అద్భుతాన్ని చూడొచ్చు. అదే అండమాన్ ద్వీపం. సెలవులు గడపడానికి అండమాన్ బెస్ట్ ప్లేస్. అండమాన్, నికోబార్ దీవుల అందం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తుంది.

ఉత్తర అండమాన్‌లో అనేక అందమైన ప్రదేశాలు ఉన్నాయి. ప్రశాంతమైన సముద్రం చాలా దూరం విస్తరించి ఉండటం, దాని నీలం రంగును చూసి అక్కడే ఉండిపోవాలి అన్పిస్తుంది ఎవరికైనా.

అండమాన్ సందర్శించడానికి ఉత్తమ సమయం డిసెంబర్ నుండి మార్చి వరకు ఉంటుంది. మీరు అండమాన్ దీవులలో వాటర్‌స్పోర్ట్‌లను కూడా ఆస్వాదించవచ్చు.

అండమాన్ చేరుకోవడం ఎలా ?
అండమాన్ కోసం కోల్‌కతా, ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు నుండి పోర్ట్ బ్లెయిర్‌కు విమానాల ద్వారా వెళ్ళాలి. ఇక్కడ నుండి క్రూయిజ్‌లో వెళ్లాలి.

ఎంత ఖర్చు అవుతుంది ?
ఢిల్లీ నుండి అండమాన్ వెళ్తే, విమాన టిక్కెట్ సుమారు 5500 నుండి 8000 రూపాయలు ఉంటుంది. 4 నుండి 5 రోజులు అండమాన్‌లో ఉంటే... మిడ్ రేంజ్ హోటల్, ఫెర్రీ రైడ్, ఫుడ్ అండ్ డ్రింక్‌లో సుమారు 20000 నుండి 25000 రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అండమాన్ దీవులలో అనేక హోటల్స్ ఉంటాయి.

ఈ ప్రదేశాలు ప్రత్యేకమైనవి
అండమాన్, హావ్‌లాక్ ద్వీపంలో మీరు దట్టమైన అడవులు, పగడపు దిబ్బలు, అందమైన దృశ్యాలను చూడవచ్చు. హావ్‌లాక్ రాధానగర్ బీచ్ అత్యంత ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం. ఇక్కడ మీరు ఫిషింగ్, స్కూబా డైవింగ్, ఈత ఆనందించవచ్చు. ఇది కాకుండా ఏనుగు బీచ్ కూడా సందర్శించడానికి మంచి ప్రదేశం. హేవ్‌లాక్ నుండి ఈ బీచ్ చేరుకోవడానికి పడవ మార్గం ఉంటుంది. అటవీ మార్గం ద్వారా కూడా వెళ్ళవచ్చు.


ఇక ఆలస్యం దేనికి? మాల్దీవ్స్ కు వెళ్లలేకపోతున్నామనే బాధను పక్కన పెట్టి మన అండమాన్ లో స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేయండి.


మరింత సమాచారం తెలుసుకోండి: