కొందరు కొన్ని పనులు చేయొద్దు అన్నప్పటికీ చేస్తూనే ఉంటారు. అది ఇతరులకు ఇబ్బంది కలిగించవచ్చు గాక, వాళ్ళు మాత్రం అర్ధం చేసుకోకుండా అదే పని చేస్తూనే ఉంటారు. అది వాళ్ళ బలహీనత కావచ్చు లేదా అదొక మానసిక వ్యాధి కూడా కావచ్చు. ఇక ఆ పని కూడా సాధారణంగా ఇతరులు చేసినట్టుగా కాకుండా చాలా సులభంగా చేస్తారు. ఇలా ఒకపని చేయడంలో ప్రావిణ్యం సాధించడం మంచిదే, కానీ అది చెడు అలవాటు అయితే, ఇంకెంత మందిని ఇబ్బంది పెడుతుందో కదా. ఈ విషయాలు ఆలోచించలేరు వాళ్ళు. ఆ అలవాటు దొంగతనం అయితే, ఇంకేముంది ఆ వ్యక్తి తన అలవాటుతో సంపాదన దొంగగా చేస్తాడు. దానితో బాగా బ్రతకవచ్చు కానీ దొరికిన ప్రతిసారి దొంగతనం చేసినప్పుడల్లా జైలుకు వెళ్లాల్సిందే.

ఈ నేపథ్యంలోనే భువనేశ్వర్ కు చెందిన ఒక వ్యక్తి దాదాపు మూడు దశాబ్దాలుగా దొంగతనాలు చేస్తూనే ఉన్నాడు. దాదాపు 500 ఇళ్లలో దొంగిలించి 5కోట్లు కూడబెట్టి దానితో గొప్పగా బ్రతికేస్తున్నాడు. తాజాగా అతడు మరో దొంగతనం చేస్తూ పోలీసులకు దొరికిపోయాడు.  విలాసంగా బ్రతకడానికే ఇదంతా చేశాడా.. లేక అలవాటు కనుక దొంగతనాలు చేశాడా.. ! ఒడిశా పోలీసులు ఇతడికి క్రౌబర్ మాన్ గా పేరు పెట్టుకున్నారు. దొంగతనాలు చేయడం, పోలీసులకు చిక్కడం, జైలుకు వెళ్లడం, విడుదల అయ్యాక మళ్ళీ దొంగతనాలు చేయడం ఇదే అతని రోజువారీ పని.  నేడు మళ్ళీ అదేపనిచేస్తూ అధికారుల కంట పడి ఖైదు చేయబడ్డాడు.

ఇతడు ఒడిశా కు చెందిన హేమంత్ దాస్. 1986 నుండి దొంగతనాలు చేస్తూనే ఉన్నాడు. ఇప్పటివరకు 500 ఇళ్లలో దొంగతనాలు చేశాడు. 5కోట్ల రూపాయలు పోగుచేసుకున్నాడు. దోపిడీ చేసిన సొమ్ముతో విలాసంగా జీవిస్తున్నాడు. ఇతడు కళాశాల విధ్యాబ్యాసంలో ఉండగా, 1980లో ఒక వివాదం లో పాల్గొని జైలుకు వెళ్ళాడు. అక్కడ ఉన్న మరో ఖైదీతో పరిచయం కావడంతో  అతడి దగ్గర దొంగతనాలలో మెళుకువలు తెలుసుకున్నాడు.  అంతే 1986 నుండి మంచి ప్రావిణ్యం సాధించాడు. 2018 లో చేసిన దొంగతనానికి  రెండేళ్లుగా జైలు శిక్ష విధించగా జులైలో విడుదల అయ్యాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: