మన దేశంలో ఎక్కువ మందికి భోజనమే ప్రధాన ఆహారం. ఎన్నో రకాల పోషకాలు ఉన్న ఈ రైస్ ను మనం ఎన్నో రకాలుగా వండుకొని తింటున్నాము. ఇలా వండుకొని తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే ఇక్కడ గమనించదగ్గ విషయం ఏమిటంటే రైస్ ని నానబెట్టే ఎందుకు వండాలి, అనే సందేహం ప్రతి ఒక్కరికి కలగవచ్చు. వాటి గురించి ఇప్పుడు చూద్దాం.


బియ్యాన్ని కొంతమంది ఎక్కువ సార్లు కడుగుతూ ఉంటారు. మరి కొంతమంది కేవలం ఒకసారి అందులోకి నీళ్ళుపోసి వండుకుంటారు. అయితే బియ్యాన్ని మాత్రం నానబెట్టి వండుకున్నట్లయితే మనకి అనేక ప్రయోజనాలు ఉన్నట్లుగా కొంతమంది నిపుణులు కూడా తెలియజేశారు. ఇక అంతే కాకుండా పూర్వపు రోజుల్లో మన ఇంట్లో అమ్మమ్మలు, నానమ్మలు కూడా బియ్యాన్ని ఎక్కువ సేపు నానబెట్టే వండేవారు.


బియ్యాన్ని వండడానికి ముందు నానబెట్టడం వలన అందులోకి కొన్ని పోషకాలు విడుదలవుతాయి. రైస్ నుండి విటమిన్స్, ఖనిజాలు వంటివి వెలువడతాయి. నానబెట్టడం వల్ల బియ్యం త్వరగా ఉడుకుతుంది. బియ్యాన్ని కలగడం వల్ల అవి కొద్దిగా మెరుస్తాయి. అయితే బాస్మతి  బియ్యాన్ని మాత్రం ఎక్కువ సేపు నానబెట్టడం వల్ల చాలా ప్రమాదమట. అయితే ఏ బియ్యాన్ని ఎంత సేపు నానబెట్టాలో ఇప్పుడు చూద్దాం.

 1). పాలిష్ చేయకుండా ఉండేటువంటి బియ్యాన్ని..6-12 గంటల పాటు నానబెట్టాలి.

2). పాలిష్ చేసిన బియ్యాన్ని..4-6 గంటలసేపు నానబెట్టాలి.

3). సగ్గు బియ్యాన్ని అయితే..30-60 నిమిషాల పాటు నాన బెట్టాలి

4). బాస్మతి రైస్ నైతే..20-40 నిమిషాల పాటు నాన బెట్టాలి.

మన ఇండియాలో అన్నానికి చాలా ప్రాముఖ్యత ఉంది. మన దేశంలోని ప్రధాన ఆహారంగా దీనిని పరిగణిస్తారు. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ప్రధాన వంటకంగా ఉన్నది. ఎన్ని రకాలుగా బియ్యం ఉన్నప్పటికీ ఉడకబెట్టి తినడమే చాలా మంచిదని కొంతమంది నిపుణులు తెలియజేస్తున్నారు. అందులో ఉండే పోషకాలు సులువుగా మనలోకి వెలువడతాయని తెలియజేస్తున్నారు. బియ్యంలో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: