డబ్బులు ఉంటే చాలు దేన్నైనా కొనుక్కోవచ్చు అనుకోవడం నిజంగా అమాయకత్వం. ఈ ప్రపంచంలో డబ్బులతో కొనుక్కోలేనివి చాలానే ఉన్నాయి ముఖ్యంగా ఆరోగ్యం. డబ్బులు కోసం పరుగులు తీస్తూ ఆరోగ్యాన్ని పక్కన పెడితే తరువాత మూల్యం చెల్లించక తప్పదు. అందుకే ఆరోగ్యాన్ని ముందు నుండే చాలా చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ రావాలి. నష్టం జరిగాక అతి జాగ్రత్త తీసుకోవడం వలన ప్రతిసారీ ప్రయోజనం ఉండకపోవచ్చు. అందుకనే అన్నిటికన్నా ముందు ఆరోగ్యం ప్రదానం అన్నారు. ఇక మానసికంగా ఆరోగ్యంగా లేకపోతే మనం శారీరికంగా ఆరోగ్యంగా ఉండలేము అన్నది వాస్తవం.

ఈ విషయం అందరికీ తెలుసు కానీ దాన్ని ఆచరణలో పెట్టడం మాత్రం కష్టంగా ఫీల్ అవుతుంటారు. దీనికి చాలా కారణాలే ఉన్నాయి. పరుగులు తీస్తున్న కాలం, ఫాస్ట్ జనరేషన్, అధికంగా స్థిరపడాలనే తపన, సౌకర్యాలు వగైరా వగైరా...అయితే ఆరోగ్యంగా ఉండాలంటే ముందుగా మానసిక ఆరోగ్యం చాలా ప్రదానం. మానసికంగా మనం దృఢంగా సంతోషంగా లేకపోతే బిపి అని ,షుగర్ అని ఇలా పలు అనారోగ్య సమస్యలు పాలు కావాల్సి వస్తుంది. అందుకే మానసికంగా దృఢం గాను, సంతోషంగానే ఆరోగ్యంగానూ ఉండాలి.  మానసిక ప్రశాంతత చాలా అవసరం అపుడే మన ఆలోచనలు స్థిరంగా ఉంటూ శరీరంలో జరిగే ప్రక్రియలు సక్రమంగా జరుగుతుంటాయి. లేదంటే ఒత్తిడికి లోనవడం, ఆలోచనలో నిలకడ లేకపోవడం వంటివి జరుగుతుండటం వంటివి జరిగి మన ఆరోగ్యం దెబ్బతింటుంది.

మానసిక ఆరోగ్యం అనేది ఎంత ముఖ్యమో గ్రహించడం పాటించడం వలన మనం వీలైనంత వరకు ఆరోగ్యంగా ఉండటం వీలవుతుంది. మన ఆరోగ్యం పూర్తిగా మన చేతుల్లోనే అని చెప్పలేం కానీ చాలా వరకు మన ఆరోగ్యాన్ని మనమే సంరక్షించుకోవచ్చు. మానసికంగా బలంగా ,ఆరోగ్యంగా ఉండటానికి నచ్చిన పనులు చేయడం. ప్రశాంతంగా ఉండటానికి నచ్చినవి చేయడం, ఆహ్లాదంగా ఉండటానికి ప్రయతించడం, చిన్నపాటి వ్యాయామాలు,యోగా, మనసుకు సంతోషాన్ని ఇచ్చే విధంగా నడుచుకోవడం వంటివి చేయాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: