ప్రకృతి అందించిన సహజ సిద్ధమైన పండ్లు, కాయగూరలలో అన్ని రకాల పోషకాలు ఉంటాయని ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ముఖ్యంగా శరీరంలో ఫ్రీ రాడికల్స్ తో పోరాడడానికి ఇవి చాలా చక్కగా సహాయపడతాయి. ముఖ్యంగా పండ్లతో, కూరగాయలతో జ్యూసులు కూడా తయారు చేసుకోవడం చాలా సులభం. ముఖ్యంగా చర్మ సౌందర్యాన్ని పెంపొందించుకోవాలి అంటే ఇప్పుడు చెప్పబోయే కొన్ని రకాల పానీయాలను తీసుకున్నట్లయితే మీ చర్మ సౌందర్యం మెరుగుపడుతుంది. ప్రస్తుతం మార్కెట్లో ఎన్నో రకాల ఫేస్ ప్రోడక్ట్లు అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. కానీ వీటి వల్ల చర్మ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. ముఖ్యంగా దీర్ఘకాలికంగా వీటిని ఉపయోగించడం వల్ల భవిష్యత్తులో తప్పకుండా చర్మ సంబంధిత సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.


ఇక ముఖ్యంగా సహజ సిద్ధంగా లభించే వాటితో చర్మ సౌందర్యం కోసం ఉపయోగించడం చాలా ఉత్తమమైన పని. ఇకపోతే చర్మ సమస్యలతో బాధపడుతున్న వారు వాటి నుంచి ఉపశమనం పొందాలి అంటే పండ్లు,  కూరగాయలతో తయారు చేసే ఫేస్ ప్యాక్లను అలాగే జ్యూస్లను తాగడం వల్ల మంచి రిజల్ట్ కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా పండ్లు కూరగాయలు రెండింటిలో కూడా మనకు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభించడం వల్ల శరీరంలోని ఫ్రీ రాడికల్స్ తొలగిపోవడమే కాకుండా మీ ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఇకపోతే చర్మ సౌందర్యం కోసం డైట్ లో చేర్చుకోవాల్సిన పానీయాలు ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.


దోసకాయ జ్యూస్:
చర్మాన్ని మాయిశ్చరైజింగ్ చేయడంలో చాలా కీలకంగా వ్యవహరిస్తుంది. ఇక ప్రతిరోజు మీరు దోసకాయతో తయారు చేసిన జ్యూస్ ను తాగడం వల్ల చర్మం నిగారింపు పొందడమే కాకుండా శరీరం డిహైడ్రేట్ కాకుండా ఉంటుంది. ముఖ్యంగా దోసకాయలు విటమిన్ కే , సిలికా పుష్కలంగా లభించడం వల్ల మీ శరీరాన్ని ఫిట్గా ఉంచి ఆరోగ్యంగా ఉంచడంలో సమయపడుతుంది.

వీటితోపాటు పాలకూర జ్యూస్,  క్యారెట్ , బీట్రూట్ జ్యూసులు కూడా మీ చర్మాన్ని మరింత అందంగా మారుస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: