అతిబల చెట్టు ని ముదురు బెండ చెట్టు అని అంటారు. ఇది పల్లెల్లో బాగా దొరుకుతుంది. దీని పూలు పసుపు పచ్చగా ఉంటాయి, ఆకులు ముదురు ఆకుపచ్చగా ఉంటాయి. దీనిని ఎక్కువగా ఆయుర్వేద చికిత్సలో వాడుతూ ఉంటారు. కానీ చూడ్డానికి పిచ్చిమొక్కగా అనిపిస్తుంది. ఇందులోనే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

పేరులో ఉన్నట్టుగానే అతిబల చెట్టు శరీరానికి అధిక బలాన్ని ఇస్తుంది. దీని ఆకుల రసాన్ని వారానికి రెండు, మూడు సార్లు సేవించడం వల్ల నీరసం, నిస్సత్తువ తగ్గి  శరీరం ఆక్టివ్ స్టేజ్ లోకి వెళ్తుంది.

కంటి సమస్యలు..
కంటి సమస్యలను కూడా ముదురుబెండ బాగా తగ్గిస్తుంది. దీనికోసం ముదురు బెండ  ఆకులను నీటిలో మరిగించి ఆ నీటితో మూసిన కళ్ళను కడుగుతూ ఉంటే  కంటికి గల  దోషాలు తొలుగుతాయి. అంతే కాక కంటి చూపు మెరుగవుతుంది.

 కిడ్నీ సమస్యలు..
కిడ్నీలో రాళ్లతో చాలా మంది బాధపడుతూ ఉంటారు. అలాంటివారు ఈ నాలుగు ముదురు బెండ ఆకులను తీసుకుని, ఒక గ్లాస్ నీటిలో వేసి మరిగించి, కషాయంలో తయారు చేసుకోవాలి. ఇందులో కండ చక్కెర లేదా పటిక బెల్లం కలిపి,రోజుకు మూడుసార్లు సేవించడం వల్ల కిడ్నీలో రాళ్లు కరిగిపోయి మూత్రం ద్వారా బయటికి వస్తాయి.అంతే కాక ఇలా చేయడం వల్ల మూత్రణాల ఇన్ఫెక్షన్లు, అధిక జ్వరం వల్ల మూత్రానికి వెళ్ళినప్పుడు వచ్చే మంటను తగ్గిస్తుంది.

 పిచ్చి కుక్క కరిచినప్పుడు..
సాధారణంగా పిచ్చికుక్కలు కరిచినప్పుడు వైద్యుల సహాయం తీసుకోవాలి. కానీ ఆ సమయంలో వైద్య సహాయం తొందరగా అందించ లేనప్పుడు ఈ అతిబల ఆకులను తీసుకొని బాగా నలిపి రసం తీయాలి. దానిని పిచ్చి కుక్క కరిచిన వ్యక్తికి తాగించి, గాయమైన చోట ఆకులను  కట్టుగా కట్టాలి. ఇలా చేయడం వల్ల పిచ్చికుక్క వల్ల కలిగే విషానికి విరుగుడుగా పనిచేస్తుంది. ఆ తర్వాత నిదానంగా వైద్యున్ని సంప్రదించవచ్చు.

 కీళ్ల నొప్పులు తగ్గించడానికి..

 సాధారణంగా వయసుతో పాటు కీళ్ల నొప్పులు, నడుము నొప్పి మోకాళ్ల నొప్పులు వస్తూ ఉంటాయి. అలాంటి వారికి ఈ అతిబల మొక్క యొక్క కాండాన్ని తీసుకొని, ఒక బండపై మంచినీరు వేసి, బాగా సాదాలి. దీని నుండి వచ్చిన  మిశ్రమాన్ని ఎక్కడ నొప్పులు అయితే ఉంటాయో, వాటిపై లేపనంగా వేయాలి.ఇలా వారం రోజులు పాటు చేస్తే ఎలాంటి నొప్పులనైనా, వాపులనైనా తగ్గిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: