రోజు రోజుకి ప్రపంచంలో మధుమేహం ఎక్కువగా విస్తరిస్తూ ఉంది. ఇంటికి ఒక మధుమేహం వ్యాధిగ్రస్తులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. మధుమేహం ప్రాణాంతకం ఏమీ కాదు. కానీ మధుమేహం కలవారు కొన్ని రకాల ఆహారాలకు దూరంగా ఉంటే సరిపోతుంది. కానీ సొంత వైద్యం వల్ల అన్నిటికీ దూరంగా ఉంటారు. ఇలాంటి వారు వైద్య నిపుణుల పర్యవేక్షణలో ఆహార నియమాలను పాటిస్తే డయాబెటిస్ ని నివారించుకోవచ్చు.



1).పండ్లు తినవచ్చా...!
అన్ని పండ్లలో సహజంగానే చక్కెర్లు ఉంటాయి. ఎక్కువగా ఫ్రక్టోజ్, ఇది తక్కువ గ్లైసెమిక్ సూచికను కలిగిఉంటాయి . ప్రజల్లో డయాబెటిస్ కలవారు పండ్లు తినకూడదనే సాధారణ అపోహ ఉంది.అరటిపండును సైతం షుగర్ ఉన్నవారు మొతాదులో తినొచ్చు. ఎందుకంటే ఇందులో ఖనిజాలు పుష్కళంగా ఉంటాయి. పండ్లను తగినంత తీసుకోవడం వల్ల హై బీపిని కూడా  కంట్రోల్లో ఉంటుంది.


2).షుగర్ తినకుండా.. బిస్కెట్స్ తినొచ్చా..
బిస్కెట్స్ లో కూడా ప్రాసెస్ చేసిన షుగర్స్ ఉంటాయి. వీటిని అధికంగా తీసుకోవడం వల్లశరీరంలో షుగర్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉంటుంది. టీ కాఫీలలో తగిన మోతాలను చక్కెరను, వేసుకున్న పర్లేదు కానీ ప్రాసెస్ చేసిన షుగర్ ఉన్న పదార్థాలను తీసుకోకపోవడం మంచిది.


3).నెయ్యి తినొచ్చా..
 కొంతమంది డయాబెటిస్ కలవారు నెయ్యి తినకూడదనే అపోహలో ఉంటారు. కానీ నెయ్యి, కొబ్బరి.. రెండింటిలోనూ మంచి కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఇవి ఇన్సులిన్‌కి మరింత ఉపయోగపడతాయి. గుండెను ఆరోగ్యానికి దోహద పడతాయి. పేగు శ్లేష్మాన్ని నిర్వహిస్తాయి. కావున మధుమేహం ఉన్నవారు కూడా నెయ్యిని హ్యాపీగా తినొచ్చు.

4).వాకింగ్ సరిపోతుందా..

మధుమేహులు చాలా మంది రోజూ వాకింగ్ చేస్తే సరిపోతుందని అనుకుంటారు. కానీ.. బరువులు ఎత్తడం, జిమ్‌లో వర్కౌట్స్ చేయడం వల్ల ఇన్సులిన్ ఉత్పత్తి క్రమంగా ఉంటుంది..

5).ఏమీ చేసినా మధుమేహం తగ్గదు..!
ఇది ఏమాత్రం నిజం కాదు. ఆహారం అలవాట్లు,వ్యాయామాలు, జీవన విధానం సరిగ్గా ఉంటే రక్తంలో షుగర్ లెవెల్స్ ని నియంత్రించొచ్చు. సాంప్రదాయ, స్థానిక, సీజనల్ ఫుడ్స్ తినడం వల్ల ఎలాంటి రోగాలు దరి చేరవు.

మరింత సమాచారం తెలుసుకోండి: