ఈ మధ్యకాలంలో ఒక మధుమేహ వ్యాధిగ్రస్తులు ఇంటికి ఒకరు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. కాలక్రమేణా మధుమేహం ఒక మహమ్మారిగా మారుతూ ఉంది. ఈ ప్రపంచంలో 90 శాతం మంది మధుమేహంతో బాధపడుతున్నారు. మధుమేహం వల్ల రక్తంలోని షుగర్ లెవెల్స్ హెచ్చుతగ్గులు కావడమే కాక, ఇతర శరీర భాగాలు కూడా దెబ్బతీస్తూ వుంది. షుగర్ ఎంత కంట్రోల్ గా ఉంచుకున్న దీనివల్ల అనేక ఆరోగ్యసమస్యలు చుట్టుముడుతున్నాయి. అలాంటి ఆరోగ్యసమస్యలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

 కంటిచూపు దెబ్బ తినడం..
శరీరంలోని మధుమేహం పెరగడం వల్ల క్రమంగా కంటి లోని రేటినా దెబ్బ తిని, కంట్లో శుక్లాలు రావడం, మసక మసకగా కనిపించడం, దూరం వస్తువులు చూడలేకపోవడం  వంటి సమస్యలు వస్తాయి. డయాబెటిస్ ని ఇలాగే నిర్లక్ష్యం చేస్తే కంటిచూపు పూర్తిగా కోల్పోవడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరూ డయాబెటిస్ మొదటి దశలో ఉన్నప్పుడే వైద్యుని సంప్రదించడం ఉత్తమం.

 పాదాలకు పుండ్లు అవడం..
డయాబెటిస్ వల్ల క్రమంగా నరాల వ్యవస్థ దెబ్బతిని, కాళ్లకు చిన్న దెబ్బ తగిలిన,పుండ్లు రావడం, స్పర్శ కోల్పోవడం,  నిర్లక్ష్యం చేస్తే పాదాన్ని తీసివేయల్సి రావడం జరుగుతుంది.

 మూత్రపిండాల సమస్యలు..
మధుమేహం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ హెచ్చు, తగ్గులు అయి, యూరిన్ అధికంగా ఉత్పత్తి అవ్వడానికి  దోహదం చేస్తాయి.దీని వల్ల కిడ్నీల పనితీరుపై భారం పడి, కిడ్నీ సమస్యలకు దారితీస్తాయి.

గుండె మరియు రక్తనాళాలు దెబ్బతినడం..
రక్తంలోని చక్కరస్థాయిలు అధికంగా ఉండటం వల్ల రక్తనా ళాలలు దెబ్బ తింటాయి.కావున మధుమేహంతో బాధపడేవారికి గుండె సమస్యలు మరియు కార్డియోవాస్కులర్ సమస్యల వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

 పీరియాంటల్(చిగుళ్ల)వ్యాధి..
మధుమేహం వల్ల పెరిగే చక్కెరలు చిగుళ్లకు రక్తప్రసరణనను అందించే రక్తనాళాలలో అడ్డుపడటం వల్ల చిగుళ్ల లోని కండరాలు బలహీనపడతాయి. అంతే కాక అధిక చక్కెర స్థాయిల వల్ల,చిగుళ్ల వ్యాధికి కారణమయ్యే బ్యాక్టీరియా పెరుగుదలను కూడా ప్రోత్సహిస్తుంది. చిగుళ్లలో రక్తస్రావం, సున్నితత్వం మరియు బాధాకరమైన లక్షణాలు కలుగుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: