చాలామంది ఉబకాయంతో బాధపడుతూ ఉంటే, ఇంకొంతమంది ఎంత తిన్నా పల్చగా మరి పీలగా ఉంటారు. వారు లావు పెరగడానికి ఎన్నో మందులు వాడుతున్నా సరే,ఎలాంటి ప్రయోజనం లేక బాధపడుతూ ఉంటారు. అలాంటి వారి కోసం కొన్ని ఆహారాలు ఇవ్వడం వల్ల వారు లావు అవుతారు. అలాంటి ఆహారాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

పాలు..
మీరు మరీ సన్నగా ఫీల్ గా ఉన్నట్లయితే రోజుకు రెండు గ్లాసుల పాలు తాగడం అలవాటు చేసుకోవడం చాలా మంచిది. పాలలో శరీరానికి కావాల్సిన కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, విటమిన్స్ పుష్కలంగా లభిస్తాయి. అంతేకాక ఇందులోని ప్రోటీన్స్ కండరాల పెరుగుదలకు తోడ్పడతాయి.

బ్రౌన్ రైస్..
మామూలు బియ్యం తినడం వల్ల కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా అంది,అధిక కొలెస్ట్రాల్ పెరగడానికి దోహదం చేస్తాయి. కావున బ్రౌన్ రైస్ తినడం చాలా మంచిది. ఇందులోని న్యూట్రియన్స్ ఆరోగ్యంగా శరీర బరువు పెరగడానికి సహాయపడతాయి.

 ఉడికించిన కోడిగుడ్డు..
 కోడిగుడ్డు ను తమ డైట్ లో చేర్చుకోవడం వల్ల, ఇందులోని న్యూట్రియన్స్  కండరాలు దృఢంగా తయారవడానికి, శరీర బరువు పెరగడానికి  దోహదం చేస్తాయి. కావున చిన్నాపెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు రోజుకొక ఉడికించిన గుడ్డు తినడం చాలా మంచిది.

 డ్రై ఫ్రూట్స్..
డ్రై ఫ్రూట్స్ ని మోతాదు లో తీసుకోవడం వల్ల,ఇందులోని మంచికొవ్వులు శరీర బరువు ఆరోగ్యకరంగా పెరగడానికి ఉపయోగపడతాయి. అంతేకాక ఇందులోని సహజ చక్కెరలు,యాంటీఆక్సిడెంట్లు మరియు మైక్రో న్యూట్రియన్స్ శరీర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

 మాంసాహారాలు..
మాంసా హారలైన చికెన్,మటన్, ఫిష్ వంటివి రోజు కు 100 గ్రాములు చొప్పున తీసుకోవడం వల్ల, ఇందులోని ప్రోటీన్స్ శరీర మెటాబాలిజంకీ తోడ్పడి,బరువు పెరుగుదలకు సహాయపడతాయి.

 వ్యాయామం..
మన శరీర బరువు,ఆరోగ్యం వంటివి  మనం తీసుకున్న డైట్ మీద 60 శాతం ఆధారపడితే, చేసే వ్యాయామం మీద 40 శాతం ఆధారపడి ఉంటుంది. కావున మంచి ఆహారంతో పాటు, రోజు వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవడం చాలా మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: