తిమ్మిర్లు అనేవి తరచూ వస్తూ ఉంటే అసలు ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మద్యం తాగే వారిలో ఇంకా షుగర్ వ్యాధితో బాధపడే వారిలో ఈ సమస్య చాలా ఎక్కువగా వస్తుంది. తిమ్మిర్లు తరచూ రావడానికి ప్రధాన కారణం మన శరీరంలో విటమిన్ బి 12 అనేది లోపించడమే.మన శరీరంలో విటమిన్ బి 12 అనేది చాలా కీలక పాత్ర పోషిస్తుంది. శరీర ఎదుగుదలలో, ఎర్ర రక్తకణాల తయారీలో ఇంకా అలాగే నాడీ మండల వ్యవస్థ పనితీరును మెరుగుపరచడంలో విటమిన్ బి 12 చాలా బాగా సహాయపడుతుంది. విటమిన్ బి 12 లోపించడం వల్ల శరీరంలో తగినన్ని ఎర్ర రక్తకణాలు కూడా తయారవ్వవు. దీంతో అన్ని అవయవాలకు ఆక్సిజన్ సరఫరా సరిగ్గా జరగదు. ఆక్సిజన్ సరఫరా సరిగ్గా లేన్నందున ఎక్కువగా తిమ్మిర్లు వస్తూ ఉంటాయి. విటమిన్ బి 12 లోపించడం వల్ల నరాల్లో వాపులు, తిమ్మిర్లు, వెరికోస్ వెయిన్స్ ఇంకా సయాటికా నొప్పులు వంటి ఇతర అనారోగ్య సమస్యలు కూడా తలెత్తే ఛాన్స్ ఉంది. కాబట్టి శరీరానికి తగినంత విటమిన్ బి 12 ను అందించడం చాలా ముఖ్యం.


అయితే విటమిన్ బి 12 ను మనం క్యాప్సుల్స్ రూపంలో కూడా తీసుకోవచ్చు. అలాగే మనం తీసుకునే ఆహార ద్వారా కూడా  విటమిన్ బి 12 ను అందివచ్చు. అయితే కొందరిలో విటమిన్ బి 12 ఉండే ఆహారాలను తీసుకున్నప్పటికి వారిలో తిమ్మిర్లు ఇంకా వస్తూ ఉంటాయి. అలాగే విటమిన్ బి 12 లోపం కూడా తలెత్తుతూ ఉంటుంది. మన జీర్ణవ్యవస్థ సరిగ్గా లేకపోతే మనం ఆహారాన్ని తిన్నా కూడా విటమిన్ బి 12 లోపం వస్తుంది. జీర్ణ వ్యవస్థ సరిగ్గా లేన్నందున్న మనం తీసుకునే విటమిన్ బి 12 మూత్రం నుంచి ఈజీగా బయటకు వెళ్లిపోతుంది. అందుకే మనం జీర్ణవ్యవస్థను బలంగా ఇంకా ఆరోగ్యంగా తయారు చేసుకోవాలి. జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడంలో మనకు ఆపిల్ సైడ్ వెనిగర్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ప్రతిరోజూ రెండు పూటలా ఆపిల్ సైడ్ వెనిగర్ ను తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ చాలా సక్రమంగా పని చేస్తుంది. దీంతో మనం తీసుకునే ఆహారంలో ఉండే పోషకాలు మన శరీరానికి చాలా బాగా అందుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: