ఉత్తరేణి గురించి చాలా మందికి తెలీకపోవచ్చు. ఇది చేలల్లో, పొలాల గట్ల మీద, ఖాళీ ప్రదేశాల్లో ఎక్కువగా పెరిగే మొక్కలల్లో ఒకటి. గ్రామాలల్లో ఉన్న వారికి ఈ మొక్క గురించి చాలా బాగా తెలుసు.అయితే చాలా మంది కూడా తెలీక ఈ ఉత్తరేణి మొక్కను కలుపు మొక్కగా భావిస్తూ ఉంటారు. కానీ దీనిలో ఎన్నో ఔషధ గుణాలు చాలానే ఉన్నాయి. వాత, కఫ, పిత వ్యాధులను నయం చేయడంలో ఈ మొక్క చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ మొక్కను ఉపయోగించి ఆయుర్వేదంలో చాలా రకాల అనారోగ్య సమస్యలను కూడా నయం చేస్తూ ఉంటారు. ఉత్తరేణి మొక్కలో ఉండే ఔషధ గుణాల గురించి అలాగే దాని వల్ల మనం ఎలాంటి అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం.ఉత్తరేణి మొక్కలో ప్రతి భాగం కూడా చాలా రకాల ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. మూత్రపిండాల్లో రాళ్లను తొలగించడంలో ఉత్తరేణి మొక్క  చాలా బాగా ఉపయోగపడుతుంది. పచ్చి ఉత్తరేణి గింజలను 20 గ్రాముల మోతాదులో తీసుకుని నీటితో నూరి తరువాత వడకట్టాలి.


ఈ మిశ్రమాన్ని ప్రతి రోజూ ఉదయం పూట పరగడుపున తాగుతూ ఉంటే మూత్రపిండాల్లో రాళ్లు చాలా ఈజీగా కరిగిపోతాయి. ఊపిరితిత్తులకు సంబంధించిన వివిధ రకాల సమస్యలను తగ్గించే గుణం కూడా ఈ ఉత్తరేణికి ఉంది. ఉత్తరేణి మొక్క సమూలంగా తీసుకువచ్చి కాల్చి బూడిద చేసి ఈ బూడిదకు రెండు రెట్లు పంచదారను కలిపి స్టోర్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని పూటకు మూడు గ్రాముల మోతాదులో రెండు పూటలా ఖచ్చితంగా తీసుకోవాలి.ఇలా తీసుకోవడం వల్ల దగ్గు, ఆయాసం, కఫం, జ్వరం ఇంకా దంత సమస్యలు ఈజీగా తగ్గు ముఖం పడతాయి. అదే విధంగా ఉత్తరేణి ఆకులు, వెల్లుల్లిపాయలు, మిరియాలు సమానంగా కలిపి మెత్తగా నూరి శనగగింజ పరిమాణంలో మాత్రలుగా చేసుకోని వీటిని గాలికి ఆరబెట్టి నిల్వ చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న మాత్రలను పూటకు రెండు చొప్పున వేడి నీటితో తీసుకోవడం వల్ల ఎలాంటి ఇన్ఫెక్షన్ లు భయంకర రోగాలు రావు.

మరింత సమాచారం తెలుసుకోండి: