వేసవిలో సూర్యుడు వెదజల్లే బగబగా మండే ఎండలకు తట్టుకోలేక,ఎక్కువగా డిహైడ్రేషన్ గురవుతూంటాము.ఈ వేసవితాపాన్ని తగ్గించుకోవడానికి వాటర్ కంటెంట్ అధికంగా ఉన్న పుచ్చకాయ,కీరదోస,కొబ్బరి నీళ్లు తీసుకుంటూ ఉండాలని వైద్యులు సూచిస్తుంటారు.ముఖ్యంగా దోసకాయ చవకగా, పేదవాడు సైతం తినగలిగేలా ఉంటుంది.కాబట్టి ఎక్కువగా దోసకాయలు తినడానికి మొగ్గుచూపుతారు.

దోసకాయలు తరచూ తీసుకోవడం వల్ల,ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.ఇందులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్,అధిక ఫైబర్,జీరో కొలెస్ట్రాల్, 90% నీరు వంటివి పుష్కళంగా లభిస్తాయి.వీటిని తరుచూ తీసుకోవడం వల్ల తొందరగా బరువు తగ్గవచ్చు. మరియు అధికబీపీ కంట్రోల్ లో కూడా ఉంటుంది. ఇందులోని వాటర్ కంటెంట్ శరీరాన్ని డిహైడ్రేషన్ కాకుండా కాపాడుతుంది.ఇన్ని ప్రయోజనాలు కలిగిన దోసకాయలను అతిగా మాత్రం తీసుకోకూడదని,వీటి వల్ల కొన్ని రకాల దుష్ప్రభావాలు కలుగుతాయని, పోషకాహార నిపుణులు హెచ్చరిస్తున్నారు.అవేంటో ఇప్పుడు చూద్దాం..

వ్యాపారపరంగా లభించే కొన్నిరకాల దోసకాయలను క్రిమికిటకాల నుండి రక్షించడానికి,పైపూతగా మైనపు పూత పూస్తారు.అయితే మైనపు పూతతో కూడిన ఆహారాన్ని తినడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు.దీని ఎక్కువగా జీర్ణసంబంధిత సమస్యలు వచ్చే అవకాశం.

దోసకాయలో కుకుర్బిటాసిన్ అనే సమ్మేళనం చేదుగా అనిపించేలా చేస్తుంది.ఇవి చాలా విషపూరితమైనవి.మరియు వీటిని అధికంగా వినియోగించడం వల్ల ప్రాణాంతకం మారుతాయి కూడా.

కంటిసమస్యలు..
ఒక అధ్యయనంలో కళ్ళకు దోసకాయ రసం తగలడం వల్ల, అ జ్యూస్ కళ్లకు తీవ్రమైన దురద కలిగించి, కండ్లకలక, కార్నియల్ ఎడెమాకు దారితీసింది అని పరిశోదనలు చేసి మరీ నిరూపించారు.

అధిక మూత్రవిసర్జన
దోసకాయలో వాటర్ కంటెంట్ అధికంగా ఉండటం వల్ల శరీరంలోని వ్యర్థాలను మూత్రవిసర్జన ద్వారా తొలగిస్తుంది.కానీ దీనిని అధికంగా తీసుకోవడం,ఆరోగ్యానికి మంచిది కాదు.ముఖ్యంగా గర్భిణీ స్త్రీలలో ఉమ్ము నీరు తగ్గడానికి దారితీయవచ్చును.

గ్యాస్ సమస్యలు..
దోసకాయ ఉన్న పైబర్ ఆదికంగా తీసుకున్నప్పుడు కడుపులో గ్యాస్ ఉత్పత్తి అయి,త్రేన్పులు,ఎక్కిళ్ళు వంటి వాటికీ కారణం అవుతుంది.

సైనస్‌ను తీవ్రం చేస్తుంది..
దోసకాయ అధికంగా తీసుకోవడం వల్ల,ముక్కులో ఇన్ఫ్లమేటరీ రియాక్షన్ మరియు వాయుమార్గంలో అడ్డంకులు ఏర్పడి,సైనస్ తీవ్రతరం అవుతుంది

మరింత సమాచారం తెలుసుకోండి: