చాలామందికి మసాలా వంటలు కానీ కారం,ఉప్పు ఉన్న వంటలు కానీ తిన్న వెంటనే స్వీట్ తినాలనిపిస్తూ ఉంటుంది.దానినే స్వీట్ క్రెవింగ్స్ అంటారు. అలాంటప్పుడు కొంతమంది స్వీట్ తినడం,బెల్లం ముక్క నోట్లో వేసుకోవడం కానీ అలవాటు చేసుకుంటూ వుంటారు.కానీ ఇలా స్వీట్ తినడం వల్ల చాలా దుష్ప్రభావాలు కలుగుతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఎందుకు స్వీట్ క్రెవింగ్స్ వస్తాయి..

కడుపునిండా భోజనం చేసిన తర్వాత మెదడులో సెరటోనిన్ అనే రసాయనం విడుదల అవుతుంది. దీనివల్లే భోజనం చేసిన తర్వాత తృప్తి కలిగి,స్వీట్లు తినేలా ప్రేరేపిస్తుంది.భోజనం చేసిన తర్వాత కొంతమందికి మూడ్ డల్‌గా ఉండడానికి సేరటోనిన్ విడుదలే కారణం.దీనితో స్వీట్ తినాలి అనిపిస్తుంది.మరియు మాసాల వంటల్లో ఎక్కువగా ఉప్పు,కారం ఉంటాయి.అవి తిన్న తర్వాత నోటిలో అదే రుచి ఉండడం వల్ల,ఎంత తిన్నా,నోరు కాస్త తీపి చేసుకోవాలనే కోరిక కలుగుతుంది.దానితో అనుకోకుండానే చేతులు స్వీట్ వైపు వెళ్తాయి.
అలా స్వీట్ క్రెవింగ్స్ రాకుండా ఉండాలంటే భోజనం చేసిన వెంటనే తగినన్ని నీళ్లు తప్పకుండా తాగాలి.దాని వల్ల ఆహారం సక్రమంగా జీర్ణమవుతుంది.మనం తినే ఆహారంలో కారబోహైడ్రెట్ శాతం కూడా అధికంగా ఉంటుంది.కారబోహైడ్రెట్ ఎక్కువగా తిన్నప్పుడు రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి.ఆ సమయంలో నోరు తీపి చేసుకోవాలని కోరిక కలుగుతుంది.అంటే మనకు తెలియకుండానే స్వీటు తినేలా ప్రేరేపిస్తుందన్నమాట.

స్వీట్ క్రెవింగ్స్ తగ్గించుకోవడానికి..

స్వీట్లు ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు.ఇలా స్వీట్ లు అధికంగా తీసుకోవడం వల్ల దీర్ఘకాలిక వ్యాధులు కలిగిస్తాయి.ముఖ్యంగా డయాబెటిస్‌కు దారి తీయోచ్చు. ఆహారం తిన్న తర్వాత స్వీటు తినాలనిపించడం ఒక మానసిక సమస్యగా పరిగనించాలని వైద్యులు చెబుతారు.కావున ఈ అలవాటును మానుకోవడమే చాలా ఉత్తమం.ఒకవేళ భోజనం తర్వాత స్వీటు తినాలనే కోరిక తగ్గకపోతే డార్క్ చాక్లెట్‌ను తీసుకోవడం మంచిది. లేదా చిన్న బెల్లం ముక్క తిన్నా పర్వాలేదు.లేదా ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహారాలు తీసుకోవడం ద్వారా కూడా మసాలాలు తిన్న తర్వాత తీపి తినాలనే కోరికను అదుపులో ఉంచుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: