సగ్గు బియ్యం తెలియని వాళ్ళు ఉండరేమో.. పాయసం, కిచిడి, ఉప్మా, వడియాలు ఇలా రకరకాల వంటలను సగ్గబియ్యంతో తయారు చేసుకుంటారు. వీటిని జావా లాగా చేసుకొని తాగితే శరీరంలోకి అధిక వేడి తగ్గుతుంది. అందుకే వేసవిలో ప్రతి ఒక్కరూ సగ్గు బియ్యాన్ని ఉపయోగిస్తారు. కేవలం వేడిని తగ్గించడం మాత్రమే కాదు.. బరువును అదుపులో పెట్టుకోవాలని అనుకునేవారు సగ్గుబియ్యాన్ని ఆహారంలో చేర్చుకుంటే సరిపోతుందని నిపుణులు అంటున్నారు.