* "భూమి " అనే రెండక్షరాల పైన పుట్టి 
* "ప్రాణం "అనే రెండక్షరాల జీవం పోసుకుని 
* రెండక్షరాల "అవ్వ "తాత ""అమ్మ ""నాన్న " "అన్న ""అక్క " అనే బాంధవ్యాల నడుమ పెరుగుతూ 
* రెండక్షరాల "గురు " వు దగ్గర 
* రెండక్షరాల "విద్య "ని నేర్చుకుని 
* రెండక్షరాల "డబ్బు " ని సంపాదించి 
* రెండక్షరాల "భార్య" "బిడ్డ" అనే బంధాలను ఏర్పరచుకొని
* రెండక్షరాల "ప్రేమ"ను పంచుతూ 
* రెండక్షరాల "స్నేహం" పెంపొందించుకుంటూ 
* రెండక్షరాల "బాధ "ని భరిస్తూ 
* రెండక్షరాల "కోపం "ను దూరం చేసుకుని 
* రెండక్షరాల "నేను "అనే అహంకారాన్ని మరచి 
* రెండక్షరాల "మనం "అనే మమకారాన్ని పెంచి 
* రెండక్షరాల "జాలి..దయ '" లను కొండంత పెంచుతూ 
* రెండక్షరాల "తీపి "అనుభవాలను గుర్తు చేసుకుంటూ 
* రెండక్షరాల "చేదు "సంఘటనలను మర్చిపోతూ 
* రెండక్షరాల "ముప్పు " వచ్చి
* రెండక్షరాల "చావు " వచ్చే వరకు 
* రెండక్షరాల "ముఖం "పైన 
* రెండక్షరాల "నవ్వు "ఉంటే 
* రెండక్షరాల "స్వర్గం "మన  అరచేతిలో ఉన్నట్లే..!!
ఈ సత్యాలను తెలుసుకుని జీవించగలిగేతే అదే జీవితం ....


మరింత సమాచారం తెలుసుకోండి: