మధుమేహం వైద్య పరిభాషలో డయాబెటిస్ మెల్లిటస్ అని వ్యవహరిస్తారు. డయాబెటిస్ అనేది ఈ రోజుల్లో కామన్‌గా కనిపిస్తున్న అంశం. డయాబెటిస్ ఉన్నవారి రక్తంలో... గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువగా పెరుగుతూ, ఎక్కువగా తగ్గుతూ ఉంటాయి. ఏదైనా సందర్భంలో రక్త పరీక్షలు చేయించుకున్నపుడు, లేదా ఎవరికైనా రక్తదానం చేయాల్సివచ్చినపుడు చాలామందిలో మధుమేహం బయటపడుతుంది. దాదాపు ఈ వ్య‌ధితో బాధ‌ప‌డుతుట్టు చాలా మందికి తెలియ‌నే తెలియ‌దు. 


ఇక ఈ రోజుల్లో డయాబెటిస్ ఉన్నవారికి దాంతోపాటూ హార్ట్ ఎటాక్, కిడ్నీ ఫెయిల్యూర్ వంటి ఇతర ఎన్నో సమస్యలు కూడా వస్తున్నాయి. అందుకే ముందుగానే ఈ వ్యాధి ల‌క్ష‌ణాలు గుర్తించాలి. మాటిమాటికీ మూత్రాన్ని అతిగా విసర్జించటం, నీరసం, బలహీనత, బరువు తగ్గిపోవడం, మూత్రనాళ ఇన్ఫెక్షన్లు, నోరు పొడారటం, అతిగా దప్పిక. అలా జరుగుతోందంటే.. ఆ వ్యక్తికి డయాబెటిస్ ఉండే అవకాశాలు ఎక్కువ.


ఇలాంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే ఖ‌చ్చితంగా వైద్య ప‌రీక్ష‌లు చేయించుకోవాలి. ముందుగా తెలుసుకోవ‌డంతో.. ఆరోగ్యవంతమైన ఆహారం ద్వారా ఈ సమస్య నుంచి తప్పించుకోవచ్చు. అయితే వంశపారంపర్యంగా మధుమేహం వచ్చే అవకాశం ఉంది. శారీరక శ్రమ పూర్తిగా లోపించడం, గంటల తరబడి కూర్చోని ఉండటం, పోషకపదార్థాలు సరిగా లేని ఆహారం వ‌ల్ల డ‌యాబెటిస్ వ‌చ్చే అవ‌కాశాలు ఎక్కువ‌. అందుకే ముందు జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌నిస‌రిగా తీసుకోవాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: