మన ఇంట్లో ఎక్కువగా గుండ్రంగా.. పెద్దగా ఉబ్బిన చపాతీలను చేస్తూ ఉంటారు. మనం వాటిని ఎంచక్కా తినేస్తూ ఉంటాం. అయితే ఈ రోజుల్లో ఎంతో మంది పిండి ఎలా కలుపుకోవాలో చపాతీలను ఎలా మెత్తగా చేయాలి అనే విషయం తెలియక చాలామంది సతమతమవుతున్నారు.పిండి కలపడం రాకపోవడం వల్ల చపాతీలు సరిగ్గా గా రావడం లేదంటున్నారు. అంతే కాకుండా చపాతీలు చేసేటప్పుడు ఎంత నీటిని వాడాలి, చపాతీలు మెత్తగా రావాలంటే ఏం చేయాలో ఇప్పుడు మనం ఇక్కడ తెలుసుకుందాం.

చపాతి చేయడానికి సిద్ధమైనప్పుడు పిండిని పిసికే టప్పుడు కాస్త గోరు వెచ్చని నీటిని అందులో ఉపయోగించాలి.. అలా చేయడం వల్ల మీరు చెసే చపాతీలు చాలా మెత్తగా ఉంటాయి. పిండిని ఏదైనా గిన్నెలో తీసుకున్న తర్వాత అందులో కి కాస్త గోరువెచ్చని నీటిని వేసి బాగా పిండిని కలవ వలసి ఉంటుంది ఇలా చేసిన తరువాత ఆ పిండిని పది నిమిషాల పాటు మూత పెట్టి పక్కన ఉంచాలి. ఇలా చేయడం వల్ల పిండి బాగా ఉబ్బుతుంది.


అయితే చపాతీలు మెత్తగా రావాలంటే పిండిలో కి నీటిని కాకుండా పాలను ఉపయోగించడం వల్ల చపాతీలు మెత్తగా వస్తాయి. అయితే పిండిని కలిపేటప్పుడు కొద్దిగా పాలని ఎక్కువ తడిగా లేకుండా ఉండే విధంగా చూసుకోవాలి.

చపాతి రుచి గా రావడం లేదా.. అయితే ఇదే మీ సమస్య అయితే మీరు పిండిలో తగినంత ఉప్పు వేసుకోవచ్చు.. పిండిని పిసికి కలిపే ముందు కొద్దిగా ఉప్పును వేసుకున్నట్లయితే రుచిగా ఉంటాయి.

పిండిని తీసుకుని తర్వాత.. పిండి గట్టి పడకుండా ఉండాలంటే.. అందులోకి కాస్త నూనె వేయడం మంచిది. ఇలా చేయడం వల్ల పిండి మెత్తగా అయ్యి గట్టిపడకుండా ఉంటుంది. ఇలాంటివి చేయడం వల్ల చపాతీలు చాలా మృదువుగా, తినడానికి మెత్తగా, రుచిగా కూడా ఉంటాయని చెప్పవచ్చు. అయితే కలిపేటప్పుడు వీటన్నిటినీ తగిన మోతాదులోనే కలుపుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: